బెజ్జంకి సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు,14 రెవెన్యూ గ్రామాలు కలవు. సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు, తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన తన్నీరు హరీష్ రావు స్వగ్రామం తోటపల్లి ఈ మండలంలో ఉంది. ఈ మండలం హస్నాబాదు రెవెన్యూ డివిజన్, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. భౌగోళికం, సరిహద్దులు: బెజ్జంకి మండలం సిద్ధిపేట జిల్లాలో ఉత్తరంవైపున రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన కోహెడ మండలం, పశ్చిమాన చిన్నకోడూరు మండలం, ఉత్తరాన మరియు తూర్పున కరీంనగర్ జిల్లా, వాయువ్యాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53989. ఇందులో పురుషులు 26799, మహిళలు 27190. అక్షరాస్యుల సంఖ్య 31048. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bejjanki, Cheelapur, Daacharam, Davvakkapalli, Gagillapur, Guggilla, Gundaram, Kallepalli, Muthannapet, Potharam, Regulapalli, Thotapally, Vadloor - Begumpet, Veerapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బెజ్జంకి (Bejjanki):బెజ్జంకి సిద్ధిపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. బెజ్జంకిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. కల్లేపల్లి (Kallepalli): కల్లేపల్లి సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలమునకు చెందిన గ్రామము. 2014 ఏప్రిల్‌లో ఉపాది పనులు చేస్తున్నకూలీలకు ఓ కుండ పగిలి అందులో 139 రాగి నాణేలు బయటపడ్డాయి. తోటపల్లి (Thotapally): తోటపల్లి సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలమునకు చెందిన గ్రామము. సమరయోధుడు బోయినపల్లి వెంకట రామారావు, సిద్ధిపేట శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి అయిన తన్నీరు హరీష్ రావు స్వగ్రామం ఈ గ్రామమే. (పుట్టినది మాత్రం చింతమడక). ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Bejjanki Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి