19, జులై 2014, శనివారం

మెదక్ జిల్లా (Medak Dist)

 మెదక్ జిల్లా
పరిపాలన కేంద్రంసంగారెడ్డి
జనాభా30,31,877
మండలాలు46
వైశాల్యం
మెదక్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. సంగారెడ్డి ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నర్సాపూర్‌, రామాయంపేట , గజ్వేల్‌, నారాయణ్‌ఖేడ్‌ జిల్లాలోని ప్రముఖ పట్టణాలు. 46 మండలాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోకసభ నియోజకవర్గాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగాపనిచేసిన టంగుటూరి అంజయ్య, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, సమరయోధులు వెల్దుర్తి మాణిక్యరావు, మగ్దూం మొహియుద్దీన్, సంగం లక్ష్మీబాయి, సాహితీవేత్తలు నందిని శిద్ధారెడ్డి, జ్వాలాముఖి ఈ జిల్లాకు చెందినవారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చర్చి మెదక్ చర్చి, ప్రముఖ అధ్యాత్మికక్షేత్రం ఏడుపాయల ఈ జిల్లాలోనివే. 2011 ప్రకారం జిల్లా జనాభా 30,31,877.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ జిల్లాకు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన నిజామాబాదు జిల్లా, దక్షిణాన రంగారెడ్డి జిల్లా, ఈశాన్యాన కరీంనగర్ జిల్లా, తూర్పున వరంగల్ జిల్లా, ఆగ్నేయాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మంజీరానది ఈ జిల్లాలో ప్రవహించు ముఖ్యనది.

మెదక్ చర్చి
చరిత్ర:
మెదక్ ప్రాంతాన్ని పూర్వం మెతుకు సీమగా వ్యవహరించేవారు. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, ఆసఫ్‌జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1930లో తొలి ఆంధ్రమహాసభ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. 1948 సెప్టెంబరు 17న ఈ జిల్లా భారతదేశంలో భాగమైంది. హైదరాబాదు రాష్ట్రంలో ఉంటూ 1956 నవంబరు 1న తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించుటతో ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది.

రవాణా సౌకర్యాలు:
దేశంలోనే అతిపొడవైన 7వ నెంబరు (44వ) జాతీయ రహదారి, విజయవాడ, పూణె జాతీయ రహదారులు జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. సికింద్రాబాదు నాందేడ్ రైల్వేలైన్, హైదరాబాదు-వాడి మార్గం జిల్లా నుంచి వెళ్ళుచున్నది.

విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మెదక్ జిల్లా,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక