17, జనవరి 2015, శనివారం

మధ్యప్రదేశ్ (Madhya Pradesh)

మధ్యప్రదేశ
రాజధానిభోపాల్
జిల్లాలు51
వైశాల్యం3,08,252 చకిమీ
జనాభా7,25,97,565
మధ్యప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఇది భౌగోళికంగా దేశం మధ్యలో ఉంటూ భారతదేశపు గుండెగా అభివర్ణించబడుతుంది. రాష్ట్ర రాజధాని భోపాల్. వైశాల్యంలో రెండోస్థానంలో, జనాభాలో ఆరవ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్రలో అవంతి జనపదం విలసిల్లిన ప్రాంతమిది. తర్వాత మౌర్యులు, గుప్తులు, రాజపుత్రులు, మొఘలులు, బ్రిటీష్ వారు పాలించారు. బ్రిటీష్ వారి కాలంలో సెంట్రల్ ప్రావిన్సుగా పిలువబడింది. స్వాతంత్ర్యానంతరం నాగ్పూర్ రాజధానిగా ఏర్పాటుచేయబడి 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణ సమయంలో మార్పులకు గురైంది. 2000వరకు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మధ్యప్రదేడ్‌ రాష్ట్రం నుంచి ఆగ్నేయ జిల్లాలు విడదీసి ప్రత్యేకంగా ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 51 జిల్లాలు, 230 అసెంబ్లీ స్థానాలు కలవు. భోపాల్, గ్వాలియర్, ఇండోర్, ఉజ్జయిని, జబల్‌పూర్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు. స్వాతంత్ర్య సమరయోధులు శ్యాంకుమార్ శుక్లా, రవిశంకర్ శుక్లా, రాజకీయ నాయకులు ఉమాభారతి, అర్జున్ సింగ్, మోతీలాల్ ఓరా ఈ రాష్ట్రానికి చెందినవారు. నర్మద, తపతి నదులు రాష్ట్రంలో ప్రవహించు ప్రధాన నదులు. ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారి వాజపేయి గ్వాలియర్‌లో జన్మించారు.

నర్మదానది
భౌగోళికం:
భౌగోళికంగా ఈ రాష్ట్రం దేశం మధ్యలో ఉన్న ఈ రాష్ట్రం 308,252 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దేశంలోనే ఇది రెండో పెద్ద రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రానికి ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, ఆగ్నేయాన ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమనా గుజరాత్, వాయువ్యాన రాజస్థాన్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. నర్మదానది రాష్ట్రం గుండా ప్రవహించే నదులలో ప్రధానమైనది. ఇది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తుంది. దానికి దాదాపు సమాంతరంగా తపతి నది ప్రవహిస్తుంది. ఈ రెండింటి మధ్యలో వింధ్య పర్వతాలు వ్యాపించియున్నాయి.

చరిత్ర:
సాంచీ స్తూపం
జనపదాల కాలంలో ఉజ్జయిని రాజధాగా ఉన్న అవంతి జనపదం ఈ ప్రాంతంలోనే విలసిల్లింది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఈ ప్రాంతమంతా మర్యసామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో దక్షిణభాగం శాతవాహనుల అధీనంలోకి వచ్చింది. 4, 5 శతాబ్దాలలో గుప్త సామ్రాజ్యంలో భాగమైంది. మద్యయుగంలో హర్షుడు పాలించాడు. తరువాతికాలంలో రాజపుత్ర వంశాల ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా పారమారులు, బుందేల్‌ఖండ్ చందేలులు వీరిలో ముఖ్యులు.  ఖజురాహో ఆలయాలు చందేలుల కాలంలో నిర్మితమైంది. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు, మొఘలులు ఈ ప్రాంతాన్ని జయించారు. ఔరంగజేబు మరణానంతరం ముఘల్ సామ్రాజ్యం బలహీనపడి మధ్యప్రదేశ్ చాలాభాగం మరాఠాల అధీనంలోకి వచ్చింది. హోల్కర్‌లు మాళ్వాను పాలించారు. నాగపూర్‌కు చెందిన భోంస్లేలు మహాకోసల, గొండ్వానాలను, మహారాష్ట్రలోని విదర్భను పాలించారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తరువాత బ్రిటీష్ వారు అధీనంలోకి తీసుకున్నారు.  జాతీయోద్యమ సమయంలో ఇక్కడ పోరాటాలు జరిగాయి. స్వాతంత్ర్యానంతరం 1950లో నాగపూర్ రాజధానిగా మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. సెంట్రల్ ప్రావిన్సు ప్రాంతాన్ని మధ్యభారత్, వింధ్యప్రదేశ్‌ రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరాఠీ భాష మాట్లాడే దక్షిణప్రాంతమైన విదర్భను , నాగపూర్‌తో సహా, వేరుచేసి బొంబాయి రాష్ట్రంలో కలిపారు. 2000 నవంబరులో మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం 7,25,97,565 జనాభాతో దేశంలో ఆరవస్థానంలో ఉంది. 2001నాటి జనాభా 6,03,48,000తో పోలిస్తే 20.3% వృద్ధి చెందింది. గోండులు, భిల్లులు లాంతి తెగల జనాభా అధికంగా ఉంది. భోపాల్, గ్వాలియర్, ఇండోర్, జబల్‌పూర్, ఉజ్జయిని, రేవా ఈ రాష్ట్రంలోని పెద్దనగరాలు. రాష్ట్ర జనాభాలో హిందువులు 91%, ముస్లింలు 6.5% ఉన్నారు.

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: భారతదేశపు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక