వనపర్తి తెలంగాణకు చెందిన పట్టణము మరియు జిల్లా కేంద్రము. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రముగా మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రముగా కూడా ఉంది. పట్టణ శివారు నాగవరం వద్ద రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉంది. కవి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఈ పట్టణమునకు చెందినవారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ పట్టణం సంస్థాన కేంద్రంగా ఉండేది. జిల్లాలో హాకీ క్రీడకు ఈ పట్టణం పేరుగాంచింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వనపర్తి జిల్లా ఏర్పాటు కావడంతో ఈ పట్టణం జిల్లా కేంద్రంగా మారింది. జనాభా: 2011 గణన ప్రకారం పట్టణ జనాభా 60949. ఇందులో పురుషులు 31501, మహిళలు 29448. గృహాల సంఖ్య 12866. అక్షరాస్యత శాతం 70.08%. పట్టణ కోడ్ సంఖ్య 576024. చరిత్ర: సూగూరు సంస్థానంగా ప్రసిద్ధిచెందిన వనపర్తి సంస్థానానికి ఈ పట్టణం చాలాకాలం పాటు రాజధానిగా వెలుగుందినది. సూగూరు, శ్రీరంగాపూర్‌ల తర్వాత వనపర్తి రాజధాని అయి 1948 వరకు కొనసాగింది. సంస్థానాధీశుల కాలం నాటి రాజభవనం నేడు పాలిటెక్నిక్ కళాశాలగా సేవలందిస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వనపర్తి జిల్లా ఏర్పాటు కావడంతో ఈ పట్టణం జిల్లా కేంద్రంగా మారింది. రవాణా సౌకర్యాలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే తొలి బస్సుడిపో వనపర్తిలో ఏర్పాటైంది. వనపర్తి సంస్థానాధీశుల కోరికమేరకు నిజాం పాలకులు దీన్ని ఏర్పాటు చేశారు. పట్టణం నుంచి హైదరాబాదు వైపు మరియు కర్నూలు వైపు వెళ్ళుటకు రెండు ప్రధాన రహదారులున్నాయి. వనపర్తి సమీపంలోని పెబ్బేరు మరియు కొత్తకోటల మీదుగా జాతీయ రహదారి 44 వెళ్ళుచున్నది. పట్టణానికి రైలు సదుపాయం లేదు కాని వనపర్తి రోడ్ పేరిట మదనాపురంలో రైల్వేస్టేషన్ ఉంది. విద్యాసంస్థలు: ప్రభుత్వ (బాలుర) డిగ్రీ కళాశాల, ప్రభుత్వ (బాలికల) డిగ్రీ కళాశాల, శ్రీవాణి డిగ్రీ కళాశాల, స్కాలర్స్ డిగ్రీ కళాశాల, డబ్ల్యూ.సి.సి.ఎం.డిగ్రీ కళాశాల, విజేత డిగ్రీ కళాశాల, సి.వి.రామన్ డిగ్రీ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ (బాలికల) జూనియర్ కళాశాల, వ్యవసాయ మార్కెట్ కమిటి: జిల్లాలోని 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఇది ఒకటి. వేరుశనగ, మొక్కజొన్న మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. వార్షిక ఆదాయం రూ. కోటికిపైగా ఉంది. కాలరేఖ:
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
25, ఫిబ్రవరి 2014, మంగళవారం
వనపర్తి (Wanaparthy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి