బీజాపూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. దేశంలోనే అతిపెద్ద గోల్‌గుంబజ్ మరియు బీజాపూర్ కోట జిల్లా కేంద్రంలో ఉన్నాయి. జిల్లా వైశాల్యం 10,541చకిమీ, 2011 ప్రకారం జిల్లా జనాభా 22,06,918. వీరశైవ మతస్థాపకుడు బసవేశ్వరుడు, విద్యావేత్త ఎం.ఎం.కల్బుర్గి, సినీనటి అమిర్‌బాయి కర్ణాటకి ఈ జిల్లాకు చెందినవారు.
సరిహద్దులు: బీజాపూర్ జిల్లా కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు తూర్పున కల్బుర్గి (గుల్బర్గా) జిల్లా, ఆగ్నేయాన రాయిచూర్ జిల్లా, దక్షిణాన మరియు నైరుతిన భాగల్‌కోట్ జిల్లా, పశ్చిమాన కొంత వరకు బెలగావి జిల్లా, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. రవాణా సౌకర్యాలు: షోలాపూర్ నుంచి కొప్పల్ వరకు వెళ్ళు జాతీయ రహదారి జిల్లా గుండా వెళుతుంది. బీజాపూర్ గుండా రైలుమార్గం కూడా వెళ్ళుచున్నది.
చరిత్ర: ప్రారంభంలో ఇది విజయపురగా పిలువబడింది. బహమనీ సుల్తానుల కాలంలో బీజాపూర్‌గా పేరుమార్చబడింది. బహమనీ రాజ్యం ఐదు ముక్కలుగా విభజితమైన పిదప ఈ ప్రాంతం ఆదిల్‌షా రాజ్యంలో, 1724లో నిజాం రాజ్యంలో, 1760లో మరాఠా రాజ్యంలో భాగమైంది. 1848లో దత్తతస్వీకార చట్టం ప్రకారం బ్రిటీష్ వారు మరాఠా రాజ్యంతో పాటు ఈ జిల్లాను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో బీజాపూర్ జిల్లా బొంబాయి ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం 1948లో బొంబాయి రాష్ట్రంలో చేర్చారు. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణ సమయంలో ఈ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో చేర్చబడింది. 1997లో బీజాపూర్ జిల్లాను విభజించి బాగల్‌కోట్ జిల్లాను ఏర్పాటుచేశారు.
= = = = =
|
9, ఏప్రిల్ 2015, గురువారం
బీజాపూర్ జిల్లా (Bijapur District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి