గుల్బర్గా (కల్బుర్గి) కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. 1948వరకు నిజాం రాజ్యంలో ఉండి, ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా కొనసాగి, 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణతో మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రంలో చేరింది. గుల్బర్గా (కొత్తపేరు కల్బుర్గి) ఈ జిల్లా పరిపాలన కేంద్రము. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా తుంగభద్ర నది ప్రవహిస్తుండగా, భీమానది జిల్లా మధ్య గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. జిల్లా కేంద్రంలో గుల్బర్గా విశ్వవిద్యాలయం ఉంది. జిల్లా వైశాల్యం 10,951 చదరపు కిలోమీటర్లు. ఈ జిల్లా 76°.04' - 77°.42 తూర్పు రేఖాంశం, 17°.12' - 17°.46' ఉత్తర అక్షాంశం మధ్యలో విస్తరించియుంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ జిల్లా కర్ణాటకలో ఈశాన్యం వైపున తెలంగాణ మరియు మహారాష్ట్రల సరిహద్దులో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన బీదర్ జిల్లా, దక్షిణాన రాయచూర్ జిల్లా, పశ్చిమాన బీజాపూర్ జిల్లా, తూర్పున తెలంగాణ రాష్ట్రం, వాయువ్యాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. కేంద్రమంత్రిగా పనిచేసిన మల్లికార్జున్ ఖర్గే ఈ జిల్లాకు చెందినవారు. రవాణా సౌకర్యాలు: హైదరాబాదు నుంచి ముంబాయి వెళ్ళు రైలుమార్గం జిల్లా గుండా వెళుతుంది. ప్రముఖ రైల్వేజంక్షన్ వాడి ఈ జిల్లాలోనిదే. హైదరాబాదు-ముంబాయి మార్గంలో ఉన్న వాడి జంక్షన్ నుంచి వాడి-గుంతకల్లు మార్గం ప్రారంభమౌతుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 25,66,326. దేశంలోని 640 జిల్లాలలో ఇది 162వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 233.
6వ శతాబ్దంలో రాష్ట్రకూటులు ప్రస్తుత గుల్బర్గా చుట్టుప్రక్కల ప్రాంతం మీద నియంత్రణను సాధించారు. కాని చాళుక్యులు వారి రాజ్యాన్ని తిరిగి సంపాదించి రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు. 12వ శతాబ్దం చివరినాటికి దేవగిరి యాదవులు మరియు హళేబీడు హోయసాలులు ఈ జిల్లాను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రస్తుత గుల్బర్గా జిల్లా మరియు రాయచూరు జిల్లా వారి రాజ్యంలో భాగంగా ఉండేవి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు వారి రాజధానిగా గుల్బర్గా నగరాన్ని స్థాపించారు. 1724 నుండి 1948 వరకు నిజాంలచే పాలించబడిన హైదరాబాద్ రాజ్యంలో భాగంగా గుల్బర్గా ఉంది. నిజాంలను భారత సైనికదళం ఓడించిన తరువాత సెప్టెంబర్ 1948లో ఇది భారతదేశంలో విలీనం అయ్యింది. 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగి ఆ తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణతో కన్నడ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నందున ఇది మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రంలో భాగమైంది. రాజకీయాలు: కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన వీరేంద్ర పాటిల్ (1968–1971, 1988–1990) మరియు ధరంసింగ్ (2004–2006) గుల్బర్గాకు చెందినవారు. పర్యాటక కేంద్రాలు: జిల్లాలో శరణ బసవేశ్వర ఆలయం, గంగాపూర్ ఆలయం ఉన్నాయి. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు: అఫ్జల్‌పూర్, అలంద్, చించోళి, చితాపూర్, గుల్బర్గా, సేడం, వాడి
= = = = =
|
31, మార్చి 2015, మంగళవారం
గుల్బర్గా జిల్లా (Gulburga District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి