2, ఏప్రిల్ 2020, గురువారం

మెట్‌పల్లి మండలం (Metpally Mandal)

మెట్‌పల్లి మండలం
జిల్లా జగిత్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్ జగిత్యాల
అసెంబ్లీ నియోజకవర్గంకోరుట్ల
లోకసభ నియోజకవర్గంనిజామాబాదు
మెట్‌పల్లి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 23  గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్క సుమన్ ఈ మండలమునకు చెందినవారు.

ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలు, కోరుట్ల మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని ఈ మండలంలో కలిపారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున కోరుట్ల మండలం, ఉత్తరాన ఇబ్రహీంపట్నం మండలం, ఈశాన్యాన మల్లాపూర్ మండలం, ఆగ్నేయాన కొత్లాపూర్ మండలం, పశ్చిమాన మరియు దక్షిణాన నిజామాబాదు జిలా సరిహద్దుగా ఉంది. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.

రవాణా సౌకర్యాలు:
నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. మండలానికి రైలు సదుపాయము నిర్మాణంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్క సుమన్ ఈ మండలమునకు చెందినవారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 86364. ఇందులో పురుషులు 42655, మహిళలు 43709. పట్టణ జనాభా 50609, గ్రామీణ జనాభా 35755.


మెట్‌పల్లి మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Atmakur, Bandalingapur, Chowlamaddi, Jaggasagar, Kondrikarla, Masaipet, Medipalli (w), Metlachittapur, Metpalli, Peddapur, Rajeshwarraopet, Rama Lachakkapet, Ramchandrampet, Rangaraopet, Regunta, Vellulla, Vempet, Venkatraopet (w), Vittampet

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

మెట్‌పల్లి (Metpally):
మెట్‌పల్లి జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది రెవెన్యూ డీవిజన్ మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రము. పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు నిర్మాణంలో ఉన్న రైలుమార్గం మెట్‌పల్లి గుండా వెళ్ళుతుంది. మెట్‌పల్లిలో రైల్వేస్టేషన్ కూడా నిర్మించబడుతుంది.
రేగుంట (Regunta):
రేగుంట జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. 2014లో పెద్దపల్లి నుంచి లోక్‌సభకు, 2018లో చెన్నూరు నుంచి శాసనసభకు ఎన్నికైన బాల్క సుమన్ ఈ గ్రామానికి చెందినవారు.


ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: జగిత్యాల జిల్లా మండలాలు,  మెట్‌పల్లి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 226 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://Jagitial.telangana.gov.in/ (Official Website of Jagityal Dist),


Metpalli or Metpally Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక