సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు అయిన అరిగె రామస్వామి 1895లో సికింద్రాబాదులో జన్మించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన రామస్వామి ప్రారంభంలో కొంతకాలం రైల్వేశాఖలో ఉద్యోగిగా పనిచేసి రాజీనామా చేశారు. ఆ తర్వాత సునీత బాల సమాజాన్ని స్థాపించి సంఘసంస్కరణ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈయన దళతజాతికి చేస్తున్న కృషిని గుర్తించి అప్పటి నిజాం ప్రభుత్వం 1935లో హైదరాబాదు నగరపాలక సంఘం కార్పోరేటరుగా నామినేట్ చేసింది. ఈయన భాగ్యరెడ్డివర్మ, ఎస్.వెంకటరావులతో కలిసి దళిత ఉన్నతికై కృషిచేశారు. గ్రంథాలయోధ్యమంలో కూడా అరిగె రామస్వామి సేవలందించారు.
1927లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హైదరాబాదు ప్రతినిధిగా హాజరైనారు. 1950-52 కాలంలో ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అదే సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి సంయుక్త కార్యదర్శిగా కూడా సేవలందించారు. 1952లో వికారాబాదు నియోజకవర్గం (ద్విసభ్య) హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో స్థానం పొందారు. 1956 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 3 సార్లు ఎన్నికైనారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించారు. తితిదే పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. జనవరి 26, 1973న రామస్వామి మరణించారు.
= = = = =
|
Tags: Arige Ramaswamy, Dalit activists, Dalit people, People from Secunderabad, దళిత ఉద్యమనేతలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి