దోమ మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన పరిగి మండలం, దక్షిణాన మరియు ఆగ్నేయాన కుల్కచర్ల మండలం, పశ్చిమాన బొంరాస్‌పేట మండలం, నైరుతిన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన అనసూయ ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు: ఐనాపుర్ (Ainapur), అనంతరెడ్డిపల్లి (Ananthareddipalle), బాచుపల్లి (Bachpalle), బాదంపల్లి (Badampalle), బట్ల చంద్రారాం (Batla Chandraram), బొంపల్లి (Bompalle), బ్రాహ్మణపల్లి (Brahmanpalle), బుడ్లాపూర్ (Budlapur), దాదాపూర్ (Dadapur), దిర్సంపల్లి (Dirsampalle), దోమ (Doma), దొంగ ఎన్కేపల్లి (Dongayankepalle), డోర్నాలపల్లి (Dornalpalle), గంజిపల్లి (Ganjipalle), గూడూర్ (Gudur), గుమడాల (Gumdal), ఖమ్మం నాచారం (Khammam Nacharam), కిష్టాపూర్ (Kishtapur), కొండాయిపల్లి (Kondaipalle), లింగంపల్లి (Linganpalle), మల్లేపల్లి (Mallepalle), మోత్కూర్ (Mothkur), ఊట్‌పల్లి (Ootpalle), పాలెపల్లి (Palepalle), పోతిరెడ్డిపల్లి (Pothreddypalle), రాకొండ (Rakonda), శివారెడ్డిపల్లి (Sivareddipalle), తిమ్మాయిపల్లి (Timmaipalle)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి