కోట్‌పల్లి మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, తాండూరు & వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు పెద్దెముల్, బంట్వారం మండలాలలో ఉన్న 18 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మర్పల్లి మండలం, ఈశాన్యాన మోమిన్‌పేట మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన వికారాబాదు మండలం, దక్షిణాన ధరూర్ మండలం, పశ్చిమాన పెద్దెముల్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం తాండూరు & వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. 2019లో కోట్‌పల్లి జడ్పీటీసిగా విజయం సాధించిన పట్నం సునీత మహేందర్ రెడ్డి వికారాబాదు జడ్పీ చైర్మెన్ అయ్యారు. మండలంలోని గ్రామాలు: బార్వాద్ (Barwad), బీరోల్ (Berole), దరియాపూర్ (Dariyapur), హీరాపూర్ (Heerapur), ఇందోల్ (Indole), జిన్నారం (Jinnaram), కంకణాలపల్లి (Kankanalapally), కరీంపూర్ (Kareempur), కోట్‌పల్లి (Kotepally), కొత్తపల్లి (Kothapally), మల్‌శెట్టిపల్లి (Malshetpally), మన్నాపూర్ (Mannapur), మోత్కుపల్లి (Mothkupally), నాగసానిపల్లి (Nagsanpally), ఓగిలాపూర్ (Ogilapur), రాంపూర్ (Rampur), ఎనికేపల్లి (Yenkepally), ఎన్నేరం (Yenneram) ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి