మహబూబ్‌నగర్ పట్టణ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు మహబూబ్‌నగర్ మండలంలో ఉన్న పురపాలక సంఘం మరియు 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం గుండా జడ్చర్ల-రాయచూరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాడ్ డోన్ రైలుమార్గం వెళ్ళుచున్నాయి. ఈ మండలం మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం పిల్లలమర్రి, చారిత్రక తూర్పుకమాన్, పిల్లలమర్రి జింకలపార్క్, ఎస్వీఎస్ ఆసుపత్రి మండల పరిధిలో ఉన్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పల్లెర్ల హన్మంతరావు, శాసనసభ్యులుగా ఎన్నికైన లైటు ఆంజనేయులు, ఎన్.రాజేశ్వర్ రెడ్డి, పాలమూరు యువకవిగా పేరొందిన పల్లెర్ల రామ్మోహనరావు, కవి ఎదిరె చెన్నకేశవులు ఈ మండలమునకు చెందినవారు.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నవాబ్‌పేట మండలం, తూర్పున జడ్చర్ల మండలం, దక్షిణాన భూత్పూర్ మండలం, నైతుతి మరియు పశ్చిమాన మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం, వాయువ్యాన హన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని పట్టణాలు, గ్రామాలు: మహబూబ్‌నగర్ పురపాలక సంఘం (Mahbubnagar Muncipality), బోయపల్లి (Boyapalle), ఏనుగొండ (Yenugonda), ఎర్రవల్లి (Yerravalli), పాలకొండ (Palakonda), ఎదిర (Yedira), బండమీదిపల్లి (Bandameedipally), క్రిస్టియన్ పల్లి (Chirstianpally)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Rajapur Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu, Telangana Mandals information in Telugu, Telangana mandals in brief
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి