రాజాపూర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము.అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు బాలానగర్ మండలంలో ఉన్న 16 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాడ్ డోన్ రైలుమార్గం వెళ్ళుచున్నాయి. ఈ మండలం మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున బాలానగర్ మండలం, దక్షిణాన జడ్చర్ల మండలం, పశ్చిమాన నవాబ్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: రాజాపూర్ (Rajapur), తిర్మలాపూర్ (Thirumalapur), కుచ్చర్‌కల్ (Kuchcherkal), చెన్నవల్లి (Chennavalli), మల్లేపల్లి (Mallepalli), ఈద్గాన్‌పల్లి (Edganpalli), దొండ్లపల్లి (Dondlapalli), రంగారెడ్డిగూడ (Rangareddiguda), అగ్రహారం పొట్లపల్లి (Agraharam Potlapalli), కల్లేపల్లి (Kallepalli), రాయిపల్లి (Raipalli), ఖానాపుర్ (Khanapur), గుండ్లపొట్లపల్లి (Gundlapotlapalli), బీబీనగర్ (Bibinagar), రాఘవాపూర్ (Raghvapur), కుత్నేపల్లి (Kuthnepalli)
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Rajapur Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu, Telangana Mandals information in Telugu, Telangana mandals in brief
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి