13, అక్టోబర్ 2017, శుక్రవారం

వికారాబాదు మండలం (Vikarabad Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్వికారాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంవికారాబాదు
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
వికారాబాదు మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి వాడి వెళ్ళు రైలుమార్గం మండల కేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. ఇక్కడి నుంచి పర్బనికి మరో రైలుమార్గం కూడా ఉండుటచే ఇది జంక్షన్‌గా మారింది. అక్టోబరు 11, 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో భాగమైంది. మూసీనది జన్మస్థానం మరియు శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం నెలకొన్న అనంతగిరి పర్యాటక క్షేత్రంగా పేరుపొందింది. సాహితీవేత్త అమ్మంగి వేణుగోపాల్ ఈ మండలమునకు చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన నవాబ్‌పేట మండలం మరియు మోమిన్‌పేట మండలం, దక్షిణాన పూడూర్ మండలం మరియు పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, తూర్పున రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
 
చరిత్ర:
సెప్టెంబరు 17, 1948న విమోచనోద్యమం వల్ల భారత యూనియన్‌లో చేరి హైదరాబాదు రాష్ట్రంగా భాగంగా, 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండి, జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు మండలం మొత్తం సకలజనుల సమ్మె జయప్రదమైంది. 1978 వరకు హైదరాబాదు జిల్లాలో ఉండగా ఆగస్టు 15, 1978న కొత్తగా ఏర్పాటుచేసిన రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంటూ తెలంగాణ అవతరణ అనంతరం జిల్లాల పునర్విభజన తర్వాత వికారాబాదు జిల్లాలో భాగమైంది. అదే సమయంలో మండలకేంద్రం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.


జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 85561. ఇందులో పురుషులు 42788, మహిళలు 42773. అక్షరాస్యుల సంఖ్య 54111. పట్టణ జనాభా 53185, గ్రామీణ జనాభా 32376.

రాజకీయాలు:
ఈ మండలం వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కామిడి చంద్రకళ ఎన్నికయ్యారు.

మండలంలోని గ్రామాలు:
ఐనాపూర్ (Ainapur), ఆలంపల్లి (Alampally), అనంతసాగర్ (Ananthasagar), అత్వెల్లి (Athvelly), బూర్గుపల్లి (Burgupally), బుర్హాన్‌పల్లి (Burhanpally), ధన్నారం (Dhannaram), ద్యాచారం (Dyacharam), గంగారం (Gangaram), గిర్గెట్‌పల్లి ఆర్ (Girgetpalle R), గోదంగూడ (Godamguda), గొట్టిముక్ల (Gottimukla), గూడూపల్లి (Gudupally), కామారెడ్డిగూడ (Kamareddiguda), కొంపల్లి (Kompally), కొత్తగడి (Kothagadi), కొత్రేపల్లి (Kothrepally), మాచన్‌పల్లి (Machanpally), మదన్‌పల్లి (Madanpally), మాడ్గుల్ చిట్టెంపల్లి (Madgul Chittempally), మాధారం (Madharam), మైలార్‌దేవరంపల్లి (Mailardevarampally), నారాయణపూర్ (Narayanapur), పాతూర్ (Pathur), పీలారం (Peelaram), పీరంపల్లి (Peerampally), పెండ్లిమడుగు (Pendlimadgu), ఫుల్‌మడ్డి (Phulmaddi), పులుసుమామిడి (Pulusumamidi), రాళ్ళ చిట్టెంపల్లి (Ralla Chittampally), శివారెడ్డిపేట్ (Shivareddypet), సిడ్లూర్ చెంచెలం (Sidloor Chenchelam), సిడ్లూర్ మునగాల్ (Sidloor Munagal), సిడ్లూర్ పైగా Sidloor Paigah), సుర్పన్‌పల్లి (Surpanpalle), వికారాబాదు (Vikarabad), ఎన్నేపల్లి (Yennepally), ఎర్రవల్లి (Yerravally), జైదుపల్లి (Zaidupalle)

ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ

c c


హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు, వికారాబాదు రెవెన్యూ డివిజన్, వికారాబాదు  అసెంబ్లీ నియోజకవర్గం, వికారాబాదు మండలము, 


 = = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of statistics, Rangareddy Dist, 2007-08
  • Census Statistics, Rangareddy Dist, 2011
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు (G.O.Ms.No.) 248 తేది 11-10-2016

Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals, Vikarabad Mandal in Telugu, Vikarabad town information in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక