మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. 2016 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మండలంలోని 11 గ్రామాలను విడదీసి కొత్తగా అడ్డగూడూరు మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రజాకవి సుద్దాల హన్మంతు ఈ మండలంలోనే జన్మించారు. మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి చెందినవాడు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అడ్డగూడూరు మండలం, పశ్చిమాన ఆత్మకూరు (ఎం) మండలం, నైరుతిన వలిగొండ, రామన్నపేట మండలాలు, ఉత్తరాన జనగామ జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలోని గ్రామాలు: Anajipur, Bijilapur, Dacharam, Dattappaguda, Kondagadapa, Moosipatla, Mothukur, Paladugu, Panakabanda, Patimatla, Podichedu, Sadarshapur
ప్రముఖ గ్రామాలు
పాలడుగు (Paladugu):ప్రజాకవి సుద్దాల హన్మంతు 1912లో ఈ గ్రామంలోనే జన్మించారు. ఈయన కుమారుడు సుద్దాల అశీక్ తేజ సిసిమాపాటల రచయితగా పేరుపొందారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Thirumalagiri sagar Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి