పెన్‌పహాడ్ సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము.అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది. మండలకేంద్రం పెన్‌పహాడ్ చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి ఉత్తరాన సూర్యాపేట మండలం, చివ్వెంల మండలం, దక్షిణాన నేరెడుచర్ల మండలం, గరిడేపల్లి మండలం, తూర్పున మునగాల మండలం, పశ్చిమాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి, మండమం పశ్చిమ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38641, 2011 నాటికి జనాభా 1067 పెరిగి 39608 కు చేరింది. ఇందులో పురుషులు 20003, మహిళలు 19605. రాజకీయాలు: ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anajipur, Anantharam, Annaram, Bhakthalapuram, Cheedella, Dharmapuram, Dosapahad, Dupahad, Gajulamalkapuram, Lingala, Macharam, Mohammadapur, Nagulapahad, Penpahad, Potlapahad, Rajpeta, Singareddy Palem,
ప్రముఖ గ్రామాలు
పెన్‌పహాడ్ (Penpahad):మండలకేంద్రం పెన్‌పహాడ్‌లో యోగానరసింహస్వామి ఆలయం ఉంది. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం. గ్రామంలో బౌద్ధ ఆనవాళ్ళు కూడా లభించాయి. బృహత్ శిలాయుగం మొదలుకొని తొలి చారిత్రక యుగం, శాతవాహన కాలం నాటి ఆనవాళ్ళు పురావస్తు పరిశోధనలలో బయటపడ్డాయి. గ్రామం సమీపంలో బృహత్ శిలాయుగపు సమాధులు, రాకాసి గుళ్లు కూడా బయటపడ్డాయి. విమోచనోద్యమంలో గ్రామం నుంచి పలువురు పోరాటం చేశారు. ప్రభుత్వం నుంచి 20 మంది సమరయోధులు పింఛన్ కూడా అందుకున్నారు. గ్రామ పిన్‌కోడ్ 508214. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Penpahad Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి