కంది సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు సంగారెడ్డి మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా కంది మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గూండా వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: కంది మండలం సంగారెడ్డి జిల్లాలో దక్షిణంవైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున పటాన్‌చెరు మండలం, ఉత్తరాన హత్నూర్ మండలం మరియు సంగారెడ్డి మండలం, పశ్చిమాన కొండాపూర్ మండలం, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Arutla, Byathole, Cheriyal, Chidruppa, Eddumailaram, Erdanoor, Indrakaran, Julkal, Kalvemula, Kandi, Kashipur, Koulampet, Makthaalloor, Mamidipally, Topgonda, Utharpally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆరుట్ల (Arutla):ఆరుట్ల మెదక్ జిల్లా కంది మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన కాసాలబుచ్చిబాబు భాజపా జిల్లా అధ్యక్షడిగా పనిచేశారు. కంది (Kandi): కంది సంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది 65వ నెంబరు (పాత 9వ) జాతీయ రహదారిపై ఉంది. 1946లో నిజాం ఆంధ్రమహాసభలు కంది గ్రామంలో జమలాపురం కేశవరావు అధ్యక్షతన జరిగాయి. గ్రామ పిన్ కోడ్ 502285. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kandi Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి