సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఎద్దుమైలారం గ్రామంలో ఆయుధ కర్మాగారం ఉంది. సంగారెడ్డి మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్నది. 65వ (9వ) నెంబరు జాతీయ రహదారి మండలం గూండా వెళ్ళుచున్నది. కల్పగూరు శివారులో మంజీరా బ్యారేజీ ప్రాంతం మొసళ్ళ పెంపకానికి ప్రసిద్ధి. కల్పగూరులోనే కాకతీయుల కాలం నాటి శ్రీకాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. ఆలయం సమీపంలోనే మంజీరా ప్రాజెక్టు ఉంది. మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు కలవు. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న సంగారెడ్డి మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా కంది మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన పుల్కల్ మండలం, ఈశాన్యాన హత్నూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన కంది మండలం, పశ్చిమాన సదాశివపేట మండలం, నైరుతిన కొండాపూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 128917. ఇందులో పురుషులు 65860, మహిళలు 63057. పట్టణ జనాభా 70705, గ్రామీణ జనాభా 58212. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 154620. ఇందులో పురుషులు 78966, మహిళలు 75654. అక్షరాస్యుల సంఖ్య 104850. పట్టణ జనాభా 95621, గ్రామీణ జనాభా 58999. అక్షరాస్యత శాతం 76.52%. రాజకీయాలు: ఈ మండలం సంగారెడ్డి నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chintalpally, Fasalwadi, Irigipally, Ismailkhanpet, Kalabgoor, Kalwakunta, Kothlapur, Kulabgoor, Mohd.Shapur, Nagapur, Pothreddipally, Sangareddy (M ), Tadlapally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఇస్మాయిల్‌ఖాన్ పేట (Ismailkhanpet):ఇస్మాయిల్‌ఖాన్ పేట మెదక్ జిల్లా సంగారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ రాజుల కాలం నాటి బురుజు, లోపల దుర్గాభవాని ఆలయం ఉంది. కల్పగూరు (Kalpagur): కల్పగూరు మెదక్ జిల్లా సంగారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. 1955 వరకు కల్పగూరు తాలుకా కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీకాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంది. కల్పగూరు శివారులో మంజీరా బ్యారేజీ ప్రాంతం మొసళ్ళ పెంపకానికి ప్రసిద్ధి. ఇది మంజీరా సంరక్షణ కేంద్రంగా పిల్వబడుతున్నది. 1994లో మొసళ్ళ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు . సంగారెడ్డి (Sangaredy): సంగారెడ్డి పట్టణము జిల్లా కేంద్రము. ఇది 2016కు ముందు కూడా మెదక్ జిల్లా పరిపాలక కేంద్రంగా ఉండేది. ఇది పురపాలక సంఘము, అసెంబ్లీ మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రము కూడా. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Sangareddy Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి