కొండాపూర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లాలో దక్షిణం వైపున వికారాబాదు మరియు రంగారెడ్డి జిల్లాలో సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన సదాశివపేట్ మండలం, ఈశాన్యాన సంగారెడ్డి మండలం, తూర్పున కంది మండలం, ఆగ్నేయాన రంగారెడ్డి జిల్లా, దక్షిణాన మరియు పశ్చిమాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43023. ఇందులో పురుషులు 21757, మహిళలు 21266. అక్షరాస్యుల సంఖ్య 23698. రాజకీయాలు: ఈ మండలం సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Aliabad, Ananthasagar, Chimaldari Konapur, Gadimalkapur, Gangaram, Garakurthi, Girmapur, Gollapally, Goplaram (Kurd), Gunthapally, Haridaspur, Kondapur, Kutubshapet, Machepally, Malkapur, Mallepally, Mansanpally, Marepally, Mohammadapur, Munidevunipally, Saidapur, Terpole, Togarpally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొండాపూర్ (Kondapur):కొండాపూర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం చారిత్రక ప్రాశస్త్యం కల్గియుంది. శాతవాహనుల కాలం నాటి మెగస్తనీసు పేర్కొన్న 30 కోటలలో ఇది ఒకటి. ప్రాచీనకాలంలో ఈ గ్రామం కౌండిన్యాపురంగా పిల్వబడింది. శాతవాహనుల కాలంలో రోమన్లతో వాణిజ్యం జరిగింది అనడానికి రోమన్ నాణేళు లభ్యమైన ప్రాంతం కూడా ఇదే. ప్రాచీన మట్టి, గాజు, రాతి వస్తువులు, ఆభరణాలు, నాణేళు కొండాపూర్‌లో లభించాయి. క్రీ.పూ.200 కాలం నాటి గొడ్డలి కూడా ఈ గ్రామంలో లభించింది. ఇవన్నీ కొండాపూర్ మ్యూజియంలో భద్రపర్చినారు. దమయంతి (నలమహారాజు భార్య), రుక్మిణీదేవి (శ్రీకృష్ణుని భార్య) జన్మించిన ప్రాంతంగా ఇది ప్రతీతి చెందింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kondapur Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి