గుమ్మడిదల సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు జిన్నారం మండలంలో ఉన్న 12 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
గుమ్మడిదల మరియు పరిసర గ్రామాలు కూరగాయల సాగుకు ప్రఖ్యాతిచెందాయి. హైదరాబాదు నగరానికి సరఫరా చేయడానికి "మన గ్రామం - మన కూరగాయలు పథకం" కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలలో కూడా ఇది ఎంపికైంది. భౌగోళికం, సరిహద్దులు: గుమ్మడిదల మండలం సంగారెడ్డి జిల్లాలో తూర్పువైపున మెదక్ జిల్లా మరియు మేడ్చల్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి నైరుతిన జిన్నారం మండలం, మరియు హత్నూరా మండలం సరిహద్దులుగా ఉండగా, పశ్చిమాన మరియు ఉత్తరాన మెదక్ జిల్లా, దక్షిణాన మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలున్నాయి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Antharam, Bonthapally, Dacharam, Domadugu, Gummadidala, Kanukunta, Kothapally, Lakshmapur, Mambapur, Nallavally, Pyaranagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బొంతపల్లి (Bontapally):బొంతపల్లి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం అధ్యాత్మికతకు నెలవు. జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రకాళి సమేత వీరబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం గ్రామంలో ఉన్నాయి. అయ్యప్ప ఆలయాన్ని 2001లో నిర్మించారు. బొంతపల్లిలో పారిశ్రామికవాడ కూడా ఉంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, హెటొరో డ్రగ్స్, ఆనర్ ల్యాబ్స్ లిమిటెడ్, జెనెర్క్స్ ఫార్మా లిమిటెడ్ లాంటి ఫార్మా కంపెనీలు కూడా గ్రామంలో నెలకొనియున్నాయి. గుమ్మడిదల (Gummadidala): గుమ్మడిదల సంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండలకేంద్రంగా మారింది. అదివరకు జిన్నారంలో మండలంలో భాగంగా ఉండేది. గుమ్మడిదల మరియు పరిసర గ్రామాలు కూరగాయల సాగుకు ప్రఖ్యాతిచెందాయి. హైదరాబాదు నగరానికి సరఫరా చేయడానికి "మన గ్రామం- మన కూరగాయలు పథకం" కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలలో కూడా ఇది ఎంపికైంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Gummadidala Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి