జిన్నారం సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. బొల్లారం పారిశ్రామిక వాడ మండలంలో ఉంది. ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 97383. మండలంలో కళాకారులు అధికంగా ఉన్నారు. 1986-92 మధ్య జనచైతన్య కళాసంస్థ నడిచింది. ఈ మండలానికి చెందిన డి.రామకృష్ణ జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు..కొడకంచిలో శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణస్వామి ఆలయం ఉంది. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిన్నారం మండలంలోని 12 గ్రామాలను విడదీసి కొత్తగా గుమ్మడిదల మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: జిన్నారం మండలంం సంగారెడ్డి జిల్లాలో తూర్పువైపున మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గుమ్మడిదల మండలం మరియు హత్నూర మండలం, దక్షిణాన అమీన్‌పూర్ మండలం, పశ్చిమాన పటాన్‌చెరు మండలం మరియు కంది మండలం, తూర్పున మేడ్చల్-మల్కాజ్‌గిరి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 97383. ఇందులో పురుషులు 51522, మహిళలు 45861. అక్షరాస్యుల సంఖ్య 57889. పట్టణ జనాభా 48194, గ్రామీణ జనాభా 49189. స్త్రీపురుష నిష్పత్తిలో (890/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో చివరి స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 8 ఎంపీటీసి స్థానాలున్నాయి. ఈ మండలానికి చెందిన డి.రామకృష్ణ జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amdoor, Bollaram, Chetlapotharam, Gaddapotharam, Jinnaram, Khazipally, Kistaipally, Kodakanchi, Madaram, Mangampet, Nalthur, Ootla, Palem (DP), Puttaguda, Sivanagar, Solakpally, Vailal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఖాజిపల్లి (Khajipally):ఖాజీపల్లి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన డి.రామకృష్ణ జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. బొల్లారం (Bollaram): బొల్లారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో పారిశ్రామికవాడ ఉంది. ఇది ఐడీఏ బొల్లారం (IDA Bollaram)గా ప్రసిద్ధి చెందింది. కొడకంచి (kodakanchi):
కొడకంచి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణస్వామి ఆలయం ఉంది. ఇది తెలంగాంఅ కంచిగా ప్రసిద్ధి చెందింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Jinnaram Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి