కొమురవెల్లి సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజన్, జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన ఈ మండలంలో ఉంది. జనగామ నుంచి సిద్ధిపేట వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్తుంది.
అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన కొండపాక మండలం, తూర్పున మరియు దక్షిణాన చేర్యాల మండలం, నైరుతిన జగదేవ్‌పూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70540. ఇందులో పురుషులు 35265, మహిళలు 35275. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ainapur, Gouraipally, Guravannapet, Kistampet, Komuravelle, Marrimusthiayala, Posanpally, Ramsagar,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొమురవెల్లి (Komuravelli):కొమురవెల్లి సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ప్రముఖమైన ఇంద్రకోలాద్రి కొండపై మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొమురవెల్లి మన్నల్లసాగర్ జలాశయానికి పేరు ఈ దేవుని పేరిట పెట్టబడింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం వరంగల్ జిల్లాలో చేర్యాల మండలంలో ఉండేది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి