కొండపాక సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా రాజీవ్ రహదారి వెళ్ళుచున్నది. ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు బయటపడిన మర్పడగ గ్రామం ఈ మండలంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: కొండపాక మండలం సిద్ధిపేట జిల్లాలో దాదాపు మధ్యభాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన సిద్ధిపేట పట్టణ మండలం, ఈశాన్యాన నంగనూరు మండలం, తూర్పున చేర్యాల మండలం, కొమురవెల్లి మండలం, దక్షిణాన జగదేవ్‌పూర్ మండలం, నైరుతిన గజ్వేల్ మండలం, పశ్చిమాన తొగుట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే ప్రశక్తిలో ఉంది. 2015, మార్చి 2న మండలపరిధిలోని మర్పడగ గ్రామంలో విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. కాకతీయుల కాలంలో కొండపాక సైనికుల విడిదికేంద్రంగా ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన రుద్రేశ్వరస్వామి ఆలయం మండలకేంద్రంలో ఉంది. ఆధునిక కాలంలో ఈ ప్రాంతం కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలచే పాలించబడి 1948లో భారత యూనియన్‌లో విలీనం అయింది. 1948-56 కాలంలో హైదరాబాదు రాష్ట్రంలో, ఆ తర్వాత 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అక్టోబరు 11, 2016 వరకు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేరింది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48597. ఇందులో పురుషులు 24222, మహిళలు 24375. అక్షరాస్యుల సంఖ్య 25236. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని గ్రామాలు: అంకిరెడ్డిపల్లి, ఎర్రపల్లి, ఎలిగడ్డకిస్టాపూర్, ఎల్లారెడ్డిపేట, కుక్కునూర్‌పల్లి, కొండపాక, కోనాయిపల్లి, గిరాయిపల్లి, జప్తినాచారం, తిప్పారం, తిమ్మారెడ్డిపల్లి, తుక్కాపూర్, తొగుట, దుద్దాడ, పల్లిపహాడ్, పి మాసాన్‌పల్లి, బండారుపల్లి, బందారం, మంగోల్, మాతపల్లి, మాదినిపూర్, మార్పడగ, ముద్దాపూర్, లకుడారం, విశ్వనాథపల్లి, వెలికట్టు, వేములఘాట్, శిర్శనగండ్ల, సింగారం
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బందారం (Bandaram):బందారం సిద్ధిపేట జిల్లా కొండపాక మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణకు చెందిన ప్రముఖ గేయరచయిత నందిని సిద్ధారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. కొండపాక (Kondapaka): కొండపాక సిద్ధిపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం చారిత్రిక ప్రశస్తి పొందిన గ్రామం. కాకతీయరాజ్యంలో సైనికులవిడిదిగా ప్రత్యేక స్థానంఉన్నది. దాదాపు 900 సంవత్సరాలక్రితం కాకతీయుల కాలంలో కొండపాకలో నిర్మితమైన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరు గాంచినది. ప్రాచీనమైన త్రికూటేశ్వరాలయం కూడా గ్రామంలో ఉంది. కొండపాకలో ఇంజనీరింగ్ కళాశాల ఉంది. మర్పడగ (Marpadaga): మర్పడగ సిద్ధిపేట జిల్లా కొండపాక మండలమునకు చెందిన గ్రామము. తేది మార్చి 2, 2015 నాడు గ్రామంలో విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక అవశేషాలు బయటపడ్డాయి. ప్రాచీనకాలంలో మర్పడగ "మరకత మణిపురం"గా ప్రసిద్ధిచెందింది ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kondapak Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి