జగదేవ్‌పూర్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటుచేసిన మర్కూక్ మండలంలో జగదేవ్‌పూర్ మండలానికి చెందిన 5 గ్రామాలు కలిపారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో కలిసింది.
కొండపోచమ్మ ఆలయం ఈ మండలంలోనే ఉంది. దీనిపేరిటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మర్కూక్ మండలంలో నిర్మించిన జలాశయానికి కొండపోచమ్మ పేరుపెట్టబడింది. భౌగోళికం, సరిహద్దులు: జగదేవ్‌పూర్ మండలం సిద్ధిపేట జిల్లాలో దక్షిణం వైపున యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన కొండపాక మండలం, ఈశాన్యాన కొమురవెల్లి మండలం మరియు చేర్యాల మండలం, పశ్చిమాన మర్కూక్ మండలం, వాయువ్యాన గజ్వేల్ మండలం, తూర్పున మరియు దక్షిణాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47150. ఇందులో పురుషులు 23340, మహిళలు 23810. అక్షరాస్యుల సంఖ్య 24120. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Alirajpet, Ananthsagar, Baswapur, Chatlapally, Chinna Kistapur, Dharmaram, Doulapur, Gollapally, Gopalpur, Itikyal, Jagdevpur, Kondapur, Munigadapa, Peerlapally, Ramachandrapur, Rayavaram, Teegul, Teegul Narsapur, Thimmapur, Venkatapur, Venkatapur (Bg), Wattipally, Yellaiguda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
తీగుల్ నర్సాపూర్ (Teegul Narsapur):తీగుల్ నర్సాపూర్ సిద్ధిపేట జిల్లా జగ్‌దేవ్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో కొండపోచమ్మ ఆలయం ఉంది. కొమురవెల్లి మల్లన్న సోదరి కొండపోచమ్మ అని చరిత్రకారులు భావిస్తారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Jagdevpur Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి