సిద్దిపేట్ పట్టణ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న సిద్ధిపేట మండలాన్ని విభజించి గ్రామీణ, పట్టణ మండలాలను వేరుచేశారు. అదేసమయంలో ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది. సాహితీవేత్త వేముగంటి నరసింహాచార్యులు, సినీనటుడు సంపూర్ణేష్ బాబు ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: సిద్ధిపేట పట్టణ మండలానికి ఉత్తరాన చిన్నకోడూరు మండలం, తూర్పున నంగనూరు మండలం, దక్షిణాన కొండపాక మండలం, నైరుతిన తొగుట మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన సిద్ధిపేట గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bakrichapial, Burugupally, Ensanpally, Mandapally, Mittapally, Nancharpally, Narsapur, Ponnal, Siddipet (CT)+Imamabad, Siddipet (M + OG), Tadkapally, Velkatur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సిద్దిపేట (Siddipet):సిద్దిపేట జిల్లాకు చెందిన పట్టణము. ఇది పురపాలక సంఘము మరియు జిల్లా పరిపాలన కేంద్రము. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 65,158. పట్టణ శివారులో శ్రీమహారేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంది. పట్టణం హైదరాబాదు నుంచి 100 కిమీ దూరంలో ఉంది. సాహితీవేత్త వేముగంటి నరసింహాచార్యులు సిద్ధిపేటకు చెందినవారు. మిట్టపల్లి (Mittapalli) : మిట్టపల్లి సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట పట్టణ మండలమునకు చెందిన గ్రామము. సినీనటుడు సంపూర్ణేష్ బాబు ఈ గ్రామానికి చెందినవాడు. గ్రామంలో "మిట్టపల్లి గ్రామ మహిళా సమాఖ్య" ఉంది. జూలై 8, 2020న మిట్టపల్లి పప్పులు పేరుతో పప్పుల విక్రయకేంద్రాన్ని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Siddipet Urban Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి