మర్కూక్ సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని పాములపర్తి గ్రామశివారులో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ జలాశయం నిర్మించారు. కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ఉన్న ఎర్రవల్లి కూడా ఈ మండలమ్లోనే ఉంది.
అక్టోబరు 11, 2016 నాడు ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ములుగు మండలంలోని 3 గ్రామాలు, జగదేవ్‌పూర్ మండలంలోని 5 గ్రామాలు, వర్గల్ మండలంలోని ఒక గ్రామం మొత్తం 9 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటుచేయబడింది. భౌగోళికం, సరిహద్దులు: మర్కూక్ మండలం సిద్ధిపేట జిల్లాలో దక్షిణం వైపున మేడ్చల్ జిల్లా మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన గజ్వేల్ మండలం, తూర్పున జగదేవ్‌పూర్ మండలం, పశ్చిమాన వర్గల్ మండలం మరియు ములుగు మండలాలు, దక్షిణాన యాదాద్రి భువనగిరి జిల్లా, నైరుతిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47150. ఇందులో పురుషులు 23340, మహిళలు 23810. అక్షరాస్యుల సంఖ్య 24120. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Angadi Kistapur, Cheberthy, Damarakunta, Erravalli, Karkapatla, Markook, Pamulaparthi , Sivar Venkatapur, Vardarajpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎర్రవల్లి (Erravalli):ఎర్రవల్లి సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలమునకు చెందిన గ్రామము. ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయ క్షేత్రం ఈ గ్రామ శివారులో ఉంది. మర్కూక్ (Markook): మర్కూక్ సిద్ధిపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం కొత్తగా మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం ఈ గ్రామం మెదక్ జిల్లాలో భాగంగా ములుగు మండలంలో ఉండేది. గ్రామ జనాభా సుమారు 4600. మండల కేంద్రం అవతరణ దినం నాడే కొత్తగా మండల రెవెయూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Markook or Markuk Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి