9, జూన్ 2019, ఆదివారం

కోవ లక్ష్మి (Kova Lakshmi)

కోవ లక్ష్మి
జననంఫిబ్రవరి 6, 1969
జిల్లాకొమురంభీం
పదవులుఎమ్మెల్యే, జడ్పీ చైర్మెన్,
కొమురంభీం ఆసిఫాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన కోవలక్ష్మి ఫిబ్రవరి 6, 1969న వాంకిడి మండలం బంబారలో జన్మించారు. ఎంపీటీసిగా, సర్పంచిగా పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో కొమురంభీం జిల్లా జడ్పీ చైర్మెన్ అయ్యారు. తండ్రి కొట్నాక భీంరావు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
కోవలక్ష్మి 1995లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1995లో తిర్యాణి మండలం పంగిడి మాదర ఎంపీటీసిగా విజయం సాధించారు. 2001లో కూడా ఇదేస్థానం నుంచి విజయం సాధించి ఎంపిపి అయ్యారు. 2006లో ఆసిఫాబాదు సర్పంచిగా పోటీచేసి గెలిచారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2010లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2013లో తెరాస తరఫున ఆసిఫాబాదు సర్పంచిగా మళ్ళీ ఎన్నికయ్యారు. 2014లో ఆసిఫాబాదు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018లో ఆసిఫాబాదు నుంచి పోటీచేసి స్వల్పతేడాతో పరాజయం పొందారు. 2019 జడ్పీటీసి ఎన్నికలలో జైనూర్ జడ్పీటీసిగా విజయం సాధించి జిల్లాపరిషత్తు చైర్మెన్ స్థానం పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, జిల్లా పరిషత్తు చైర్మెన్లు,కొమురంభీం జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక