దర్పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో రామడుగు ప్రాజెక్టు ఉంది.
అక్టోబరు 11, 2016న సిరికొండ మండలంలోని 3 గ్రామాలను ఈ మండలంలో కలిపారు. అదివరకు దర్పల్లిలో ఉన్న 6 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన ఇందల్వాయి మండలంలో విలీనం చేశారు. భౌగోళికం, సరిహద్దులు: ధర్పల్లి మండలం నిజామాబాదు జిల్లాలో దక్షిణం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున సిరికొండ మండలం, పశ్చిమాన ఇందల్‌వాయి మండలం, ఉత్తరాన జక్రాన్‌పల్లి మండలం, ఈశాన్యాన భీంగల్ మండలం, వాయువ్యాన డిచ్‌పల్లి మండలం, దక్షిణాన కామారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47838. ఇందులో పురుషులు 22969, మహిళలు 24869. రాజకీయాలు: ఈ మండలము నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Challagarga, Dammannapet, Dharpally, Dubbaka, Govindpalle, Honnajipet, Kesaram, Konepalle, Kotalapalle, Mailaram, Ramadugu, Rekulapally
ప్రముఖ గ్రామాలు
రామడుగు (Ramadugu): రామడుగు నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రానికి 10 కిమీ దూరంలో ఉంది. గ్రామ సమీపంలో రామడుగు ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు నీటి అడుగున రామపాదం కనిపిస్తుంది. గ్రామంలో హరిహరక్షేత్రం కూడా ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dharpalli or Dharpally Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి