ఇందల్వాయి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. డిచ్‌పల్లి మండలంలోని 4 గ్రామాలు, ధర్పల్లి మండలంలోని 6 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. లోలంలో మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 11 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు కలవు. మండలం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఇందల్‌వాయి మండలం నిజామాబాదు జిల్లాలో దక్షిణాన కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన డిచ్‌పల్లి మండలం, తూర్పున దర్పల్లి మండలం, పశ్చిమాన ముగ్పాల్ మండలం, దక్షిణాన కామారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Donkal, Gannaram, Gouraram, Indalwai, (including Chandrayanpally & Thirmanpally hamlets), Lolam, Mallapur, Nallavalle, Sirnapalle, Threyambakpet, Vengalpad
ప్రముఖ గ్రామాలు
లోలం (Lolam): లోలం నిజామాబాదు జిల్లా ఇందల్వాయి మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. నల్లవెల్లి (Nallavelli): నల్లవెల్లి నిజామాబాదు జిల్లా ఇందల్వాయి మండలమునకు చెందిన గ్రామము. ఇది మిర్చిసాగుకు జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Indalwai or Indalvai Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి