2, జులై 2019, మంగళవారం

ఝార్ఖండ్ (Jharkhand)

అవతరణ15-11-2000
రాజధానిరాంచీ
వైశాల్యం 79,710 చకిమీ
జనాభా (2011)3.29 కోట్లు
అధికార భాషహిందీ
పెద్ద నగరంజంషెడ్‌పూర్
జిల్లాలు24
ఝర్ఖండ్ రాష్ట్రం నవంబరు 15, 2000న బీహార్ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడింది. రాష్ట్ర వైశాల్యం 79,710 చకిమీ (దేశంలో 16వ స్థానం), 3.29 కోట్ల జనాభా (దేశంలో 14వ స్థానం) కలిగియుంది. అధికార భాష హిందీ, రాజధాని రాంచీ, ఉప రాజధాని డుమ్కా, పెద్ద నగరం జంషెడ్‌పూర్. ఖనిజ వనరులకు దేశంలో ఝార్ఖండ్ ప్రఖ్యాతిచెందింది. కాని పేదరికం కూడా రాష్ట్రంలో అధికంగా ఉంది. సోన్, దామోదర్, మయూరాక్షి నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. సమరయోధుడు బిర్సాముండా, వైద్యుడు సుభాష్ ముఖోపాధ్యాయ,  క్రీడాకారులు జైపాల్ సింగ్ (హాకీ), మహేంద్రసింగ్ ధోని (క్రికెట్) ఈ రాష్ట్రానికి చెందినవారు. రాష్ట్రంలో 24 జిల్లాలు, 14 లోక్‌సభ స్థానాలు, 6 రాజ్యసభ స్థానాలు కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ రాష్ట్రానికి ఉత్తరాన బీహార్, వాయువ్యాన ఉత్తరప్రదేశ్, పశ్చిమాన ఛత్తిస్‌గఢ్, దక్షిణాన ఒడిషా, తూర్పున పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. జంషెడ్పూర్, ధన్‌బాడ్, రాంచీ, బొకారో, దియోగఢ్, హజారీబాగ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు.

చరిత్ర:
ఈ ప్రాంతం పురాతన చరిత్రను కలిగియుంది. క్రీ.పూ.1400లోనే ఇనుము ఉపయోగించినట్లుగా ఆధారాలు లభించాయి. భారతదేశపు ప్రముఖ రాజవంశాలైన మౌర్యులు, గుప్తులు ఈ ప్రాంతాన్ని పాలించారు. స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాంతం బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉంటూ 2000లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది
బైద్యనాథ్ జ్యోతిర్లింగం

ఆర్థికం:
ఖనిజ వనరులలో ఝార్ఖండ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇనుము, కాపర్, మైకా, అస్బెస్టాస్, సిలిమానైట్, యురేనియం తదితర ఖనిజ నిల్వలలో దేశంలో ప్రథమస్థానంలో ఉంది. క్రోమైట్ నిల్వలలో రెండోస్థానంలో, బొగ్గు నిల్వలలో మూడో స్థాన్ంలో ఉంది. అయిననూ ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు మరియు పేదరాష్ట్రంగా ఉంది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు:
రాంచీలో బిర్సాముండా విమానాశ్రయం ఉంది. బొకారో, జంషెడ్పూర్, ధన్బాడ్ నగరాలలో కూడా విమానాశ్రయాలున్నాయి. ఢిల్లీ-కోల్‌కత జాతీయ రహదారి రాష్ట్రం గుండా వెళ్ళుచున్నది. బొకారో, జంషెడ్పూర్, ధాన్‌బాద్, డుమ్కా, హజారీబాగ్, కోడెర్మా, రాంచి రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు.
బొకారో స్టీల్ కర్మాగారం

క్రీడలు:

క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ ఇక్కడ జనాదరణ పొందిన క్రీడలు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని, అథ్లెటిక్స్ క్రీడాకారిణి దీపికా కుమారి ఈ రాష్ట్రానికి చెందినవారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, ఝార్ఖండ్,


 = = = = =


Tags:Indian States information, about Jharkhand state in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక