మోర్తాడ్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. పెద్దపల్లి-నిజామాబాదు రైల్వేమార్గం మరియు నిజామాబాదు జగదల్‌పూర్ జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుతుంది. మోర్తాడ్ మండలం శెట్‌పల్లి వద్ద చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల నిర్మిస్తున్నారు. మండలంలో గ్రానైట్ గనులున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఎర్గట్ల మండలం, తూర్పున కమ్మర్‌పల్లి మండలం, దక్షిణాన భీంగల్ మండలం, పశ్చిమాన వేల్పూర్ మండలం, వాయువ్యాన బాల్కొండ మండలం మరియు ముప్కాల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56178. ఇందులో పురుషులు 26878, మహిళలు 29300. రాజకీయాలు: ఈ మండలము బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎం.నారాయణరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు.
మోర్తాడ్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Dharmora, Donkal, Donpal, Mortad, Palem, Shetpalle, Sunkat, Thimmapur, Vaddiyat
ప్రముఖ గ్రామాలు
ధర్మోర (Dharmora): ధర్మోరా నిజామాబాదు జిల్లా మోర్తాడ్ మండలమునకు చెందిన గ్రామము. 2012 మార్చి 21న హనుమాన్ దీక్షాపరులు కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి తిరిగి వస్తుండగా లారీ ప్రమాదానికి గురై గ్రామానికి చెందిన 17 మంది మరణించారు.
.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Morthad Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి