తానూరు నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 05' 25'' ఉత్తర అక్షాంశం మరియు 77° 50' 24'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఇది నిర్మల్ జిల్లాలో పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర సంప్రదాయం అధికం. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు ముధోల్ తాలుకాలోనివే. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 33 రెవెన్యూ గ్రామాలు కలవు. నిర్మల్ జిల్లాలో ఇది అతిపశ్చిమాన ఉన్న మండలం. సమరయోధుడు, భారతప్రభుత్వంచే తామ్రపత్రం పొందిన సాయన్న ఈ మండలానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలము ఆదిలాబాదులో జిల్లాలో అతిపశ్చిమాన ఉన్న మండలము. పశ్చిమాన మరియు దక్షిణాన మహారాష్ట్ర సరిహద్దు ఉండగా, ఉత్తరాన కుభీర్ మండలం, తూర్పున భైంసా మరియు మరియు ముధోల్ మండలాలు, ఈశాన్యాన బాసర మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 34831. ఇందులో పురుషులు 17516, మహిళలు 17315. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39850. ఇందులో పురుషులు 19907, మహిళలు 19943. రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
తానూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Bamni, Beltaroda, Bember, Bhosi, Bolsa, Bondrat, Boregaon (Khurd), Dhagaon, Doultabad, Elvi, Hangirga, Hipnally, Jewla (Buzurg), Jewla (Khurd), Jhari (Buzurg), Jhari (K), Kalyani, Kesarelly, Kharbala, Kolur, Kupli, Mahalingi, Masalga, Mugli, Nandgam, Singangam, Tanoor, Tondala, Umri (Khurd), Wadgaon, Wadhone, Wadjhari, Yellawat
ప్రముఖ గ్రామాలు
బేతల్‌రోడ (Betalroda): బేతల్‌రోడ నిర్మల్ జిల్లా తానూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. భైంసా నుంచి మహారాష్ట్రలోని బోకర్ వెళ్ళు మార్గం బేతల్‌రోడ నుంచి వెళ్ళుతుంది.
ఎల్వి (Elvi):
ఎల్వి నిర్మల్ జిల్లా తానూరు మండలమునకు చెందిన గ్రామము. నిజాం వ్యతిరేక పోరాటయోధుడు మహదప్ప ఈ గ్రామానికి చెందినవారు. ఔరంగాబాదులో 6 నెలల జైలుశిక్ష అనుభవించారు. కిషన్ రావు పాఠకు 1921లో జన్మించారు. ఈయన నిజాం పోరాటంలో పాల్గొని 11 నెలలు జైలుశిక్ష అనుభవించారు.
హింగిరిగా (Hingiriga):
హింగిరిగా నిర్మల్ జిల్లా తానూరు మండలమునకు చెందిన గ్రామము. స్వాతంత్ర్యసమరయోధుడు సాయన్న ఈ గ్రామానికి చెందినవారు. భారత ప్రభుత్వంచే తామ్రపత్రం పొందారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tanoor Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి