ముధోల్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ ప్రాంతం మహారాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో నిండిఉంటుంది. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 24 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలకేంద్రంలో మహారాష్ట్ర పాలకుల పురాతన గడీలు, బురుజులు ఉన్నాయి. సమరయోధుడు బలబాహు ఈ మండలానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ముధోల్ మండలం నిర్మల్ జిల్లాలో పశ్చిమభాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన భైంసా మండలం, తూర్పున లోకేశ్వరం మండలం, దక్షిణాన బాసర మండలం, పశ్చిమాన తానూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండల ఈశాన్యభాగం గోదావరినది సరిహద్దు ఉంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49911. ఇందులో పురుషులు 25024, మహిళలు 24881. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56514. ఇందులో పురుషులు 27969, మహిళలు 28545. చరిత్ర: ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం ఈ మండలం నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముధోల్ తాలుకాగా మారింది. 1986లో మండలంగా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రాంతం 2014లో నూతనంగా ఏర్పడిన తెలంగాణలో భాగమైంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మండలంలోని దక్షిణభాగం విడిపోయి ప్రత్యేకంగా బాసర మండలం ఏర్పడింది. రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
ముధోల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ashta, Boregaon, Brahmangaon, Chandapur, Chinchala, Chinthakunta, Chinthakunta RC, Edbid, Gannora, Govindpur, Gudur, Jalalpur, Karegaon, Machkal, Mudgal, Mudhole, Pipri, Ramtek, Ruvvi, Shetpalli, Taroda, Venkatapur, Vitholi, Wadthala
ప్రముఖ గ్రామాలు
అష్టా (Astra): అష్టా నిర్మల్ జిల్లా ముధోల్ మండలమునకు చెందిన గ్రామము. 1985లో ముధోల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన హన్మంతరెడ్డి స్వగ్రామం. ఈ గ్రామం గోదావరి నదికి 3 కిమీ దూరంలో ఉంది. జానపద కళాకారుడిగా రాష్ట్రస్థాయిలో పేరుగాంచిన గంగాధర్ కూడా ఈ గ్రామానికి చెందినవాడు. ముధోల్ (Mudhol): ముధోల్ నిర్మల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇక్కడ మహారాష్ట్ర పరిపాలకుల పురాతన గడీలు, బురుజులు శిథిలాలు కనిపిస్తాయి. స్వాతంత్ర్య సమరయోధులు నరహర్ భట్, బలబాహులు ముధోల్ గ్రామానికి చెందినవారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరు 7 సం.ల జైలుశిక్ష అనుభవించారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mudhol Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి