దస్తూరాబాదు నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు కదం పెద్దూర్ మండలంలో ఉన్న 8 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, ఖానాపూరసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 13 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి పశ్చిమాన కదం పెద్దూర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున మంచిర్యాల జిల్లా, దక్షిణాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఖానాపూర్ మండలం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
దస్తూరాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Bhutkur, Buttapur, Chennur, Dasturabad, Godserial, Mallapur, Munyal, Revojipet (New)
ప్రముఖ గ్రామాలు
గొడిసిర్యాల (Godiserial): గొడిసిర్యాల నిర్మల్ జిల్లా దస్తూరాబాదు మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో శివాలయం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dasturabad Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి