కదం పెద్దూర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 29 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, ఖానాపూరసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలానికి దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలం మధ్యనుంచి కడెం నది ప్రవహిస్తూ గోదావరిలో సంగమిస్తుంది. కడెం నదిపై కడెంప్రాజెక్టును ఈ మండలంలోనే నిర్మించారు. మండలంలోని వేలగడప గ్రామం నిజాం కాలంలో తాలుకా కేంద్రంగా వర్థిల్లింది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఆగ్నేయాన దస్తూరాబాదు మండలం, పశ్చిమాన పెంబి మండలం మరియు ఖానాపూర్ మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా, ఈశాన్యాన కుమురంభీం జిల్లా, తూర్పున మంచిర్యాల జిల్లా, దక్షిణాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది, మండలం గుండా కడెంనది ప్రవహిస్తున్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48632. ఇందులో పురుషులు 24592 మరియు మహిళలు 24040. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52733. ఇందులో పురుషులు 25989, మహిళలు 26744. రాజకీయాలు: ఖానాపూర్ మండలం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014 ఎన్నికలలో జడ్పీటీసిగా తక్కల రాధ ఎన్నికయ్యారు.
కదం పెద్దూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Allampally, Ambaripet, Bellal, Chittial, Dharmaipet, Dharmajipet, Dildarnagar, Gandigopalpur, Gangapur, Islampur, Kalleda, Kannapur, Kondkuru, Laxmipur, Laxmisagar, Lingapur, Maddipadaga, Maisampet, Masaipet, Nachan Yellapur, Narsapur, Nawabpet, Pandwapur, Peddur, Rampur, Revojipet (Old), Sarangapur, Udumpur, Yelagadapa
ప్రముఖ గ్రామాలు
బెల్లాల (Bellala): బెల్లాల నిర్మల్ జిల్లా కడెం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది సరిహద్దులో ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో గ్రామంవద్ద పుష్కర ఘాట్ ఏర్పాటుచేయబడింది.
కడెం (Kadem):
కడెం నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఆద్లిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఏకైక వరి విత్తనోత్పత్తి కేంద్రం కడెంలో ఉంది. లింగాపూర్ (Lingapur): లింగాపూర్ నిర్మల్ జిల్లా కడెం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం గోదావరి నది సరిహద్దులో ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో గ్రామంవద్ద పుష్కర ఘాట్ ఏర్పాటుచేయబడింది. వేలగడప (Velagadapa): వేలగడప నిర్మల్ జిల్లా కడెం మండలమునకు చెందిన గ్రామము. నిజాం కాలంలో ఈ గ్రామము తాలుకా కేంద్రంగా ఉండేది. ఇక్కడ చిన్న గడీ, పెద్ద గడీ ఉండేది, శిస్తు వసూలు చేసుకొని పెద్ద పెట్టెలో ఆ డబ్బును వరంగల్ సుభాకు తీసుకెవెళ్ళేవారు. గ్రామంలో 200 సం.ల క్రితం గుండోబా స్వామి చాలా మహిమాన్వితుడిగా ఉండేవారు. ఆయన సమాధి అయిన పిదప ఆలయం నిర్మించారు. గ్రామ సమీపంలో అక్కకొండ గుట్టపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఏటా మాఘపూర్ణమి రోజున జాతర నిర్వహిస్తారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kaddam Peddur Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి