ఖానాపూర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 32 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నదిలో ఏర్పడిన దీవిలో ఉన్న గ్రామం బాదనకుర్తి ఈ మండలంలోనిదే. ఈ మండలంలో అధికభాగం అటవీప్రాంతం ఉంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కడెం మండలం, పశ్చిమాన మామడ మండలం, ఉత్తరాన పెంబి మండలం, దక్షిణాన గోదావరి నది సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55517. ఇందులో పురుషులు 27836, మహిళలు 27681. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62034. ఇందులో పురుషులు 30786, మహిళలు 31248. పట్టణ జనాభా 13495 కాగా గ్రామీణ జనాభా 48539. రాజకీయాలు: ఖానాపూర్ మండలం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014లో ఎంపీపీగా ఆకుల శోభారాణి ఎన్నికయ్యారు.
ఖానాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Advisarangapur, Badankurthy, Bavapur (K), Beernandi, Bevapur (R), Chamanpalle, Dilwarpur, Ervachintal, Gangaipet, Iqbalpur, Khanapur, Kothapet, Maskapur, Medampalle, Patha Yellapur, Rajura, Sathnapalle, Singapur, Surjapur, Tarlapad, Thimmapur
ప్రముఖ గ్రామాలు
బాదన్‌కుర్తి (Badankurthy): బాదన్‌కుర్తి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గోదావారి నదిలో ఏర్పడిన దీవిలో ఉంది. గోదావరి నది రెండుగా చీలి ఒక దీవి ఏర్పడింది. దీనిపైనే ఈ గ్రామం ఏర్పడింది. ఈ ప్రాంతం చాలా సారవంతమైనది. ఈ గ్రామంలో పాతకాలం నాటి బురుజులు ఉన్నాయి. ఖానాపూర్ (Khanapur): ఖానాపూర్ నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఖానాపుర్ పట్టణానికి చెందిన పాలెపు సాయిప్రశాంత్ బాబు 2012మేలో అమెరికాలోని టెక్సాన్‌లో "జేమ్స్ మార్టిన్ రెసిడెంట్ లీడర్‌షిప్ అవార్డు" అందుకున్నారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khanapur Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి