సోన్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ఇందులో 9 నిర్మల్ మండలం నుంచి, 4 లక్ష్మణ్‌చందా మండలం నుంచి, ఒక గ్రామం దిలావర్‌పూర్ మండలం నుంచి తీసుకున్నారు. 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీగుగా వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నిర్మల్ గ్రామీణ మండలం, తూర్పున లక్ష్మన్‌చాందా మండలం, పశ్చిమాన దిలావర్‌పూర్ మండలం, దక్షిణాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: సోన్ మండలం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
సోన్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Soan, Shakari, Kadthal, Siddulkunta New, Old Pochampad, Pakpatla, Madapur, Jafrapur, Gamjal, Kuchanpalli, Sangampet, New Velmal, New Bopparam, Local Velmal,
ప్రముఖ గ్రామాలు
సోన్ (Sone): సోన్ నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4652. 2016 అక్టోబరులో ఇది కొత్తగా మండలకేంద్రంగా మారింది. అంతకుక్రితం నిర్మల్ మండలంలో భాగంగా ఉండేది. గ్రామంలో పలువులు వేదపండితులు, పురోహితుల వద్ద వందల సంవత్సరాల క్రితం నాటి రాతప్రతులు, గ్రంథాలున్నాయి.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Soan or Sone Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి