సుల్తానాబాదు పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలపు దక్షిణ సరిహద్దు గూండా మానేరు నది ప్రవహిస్తోంది. ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి ఉదయభాను ఈ మండలానికి చెందినది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఎలిగేడ్ మండలం, ఈశాన్యాన పెద్దపల్లి మండలం, తూర్పున ఓదెల మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దు గూండా మానేరు నది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 56717. ఇందులో పురుషులు 28586, మహిళలు 28131. గృహాల సంఖ్య 13614. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63528. ఇందులో పురుషులు 31511, మహిళలు 32017. రవాణా సౌకర్యాలు: కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 1994లో పెద్దపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికైన బిరుదు రాజమల్లు ఈ మండలమునకు చెందినవారు. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బాలాజీరావు, జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగా ఎం.స్వరూపరాణి ఎన్నికయ్యారు.
సుల్తానాబాదు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bhoopathipuram, Chinnabonkur, Chinnakalvala, Dubbapet, Garrepalli, Gattepalli, Gollapalli, Ithrajpalli, Kadambapur, Kanukula, Katnepalli, Kodurupaka, Mancharami, Miyapur, Neerukulla, Poosala, Rebbaldevipalli, Regadimaddikunt, Suddala, Sulthanabad, Thogarrai
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సుల్తానాబాదు (Sultanabad): సుల్తానాబాదు పెద్దపల్లి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన బిరుదు రాజమల్లు స్వగ్రామం. ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి ఉదయభాను ఈ గ్రామానికి చెందినది. 2016 జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం కరీంనగర్ జిల్లాలో ఉండేది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sulthanabad Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి