ఇచ్చోడ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 25' 47'' ఉత్తర అక్షాంశం మరియు 78° 27' 21'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. అడగామ (కె) గ్రామసమీపాన కల వాగుపై 850 మీ పొడువుకల ప్రాజెక్టు నిర్మించారు. మండల కేంద్రానికి 14 కిమీ దూరంలో గాయత్రి జలపాతం ఉంది. పెద్దగుండం, చిన్నగుండం అనే మరో 2 జలపాతాలు కూడా మండలంలో ఉన్నాయి. ఈ మండలము ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. టీవి యాంకర్‌గా, నటిగా, గాయనిగా పేరుపొందిన మాంగ్లీ (సత్యవతి) ఈ మండలానికి చెందినది.
మండలంలో పండించే ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 35 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న మండలంలోని 7 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన సిరికొండ మండలంలో కలిపారు. పురావస్తు కళాకేంద్రంగా భాసిల్లే సిరిచెల్మ ఈ మండలంలోనే ఉంది. ఈ మండలంలో ముల్తానీలు అధికసంఖ్యలో ఉన్నారు. వీరు పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన ముస్లింలు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గుడిహత్నూర్ మండలం, తూర్పున సిరికొండ మండలం, పశ్చిమాన నేరెడిగొండ మండలం, వాయువ్యాన బజార్‌హత్నూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43179. ఇందులో పురుషులు 22006, మహిళలు 21173. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52883. ఇందులో పురుషులు 26303, మహిళలు 26580. పట్టణ జనాభా 12341 కాగా గ్రామీణ జనాభా 40542. రవాణా సౌకర్యాలు: దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి ఇచ్ఛోడ మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఇచ్ఛోడ మండలమే బోథ్ నియోజకవర్గంలో కీలకంగా ఉంది.
ఇచ్చోడ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Adegaon K, Adegaon-B, Babjipet, Babuldow, Borigoan, Chincholi, Dhaba-B ,Dhaba-K, Dharampuri, Gaidpally, Gerjam, Gubba, Gundala, Gundi, Gundiwagu, Heerapur, Ichoda, Jalda, Jamidi, Jogipet, Junni, Kamgiri, Keshavpatnam, Kokasmannur, Lingapur, Madhapur, Malyal, Mankapur, Mukhra-B, Mukhra-K, Narsapur, Navegaon, Salyada, Sirichelma, Talamadri
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అడెగామ (Adegama): అడెగామ ఆదిలాబాదు జిల్లా ఇచ్ఛోడ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1232. ఈ గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మించబడింది. ఇచ్చోడ (Ichoda): ఇచ్చోడ ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9604. మండలంలో ఇదే అత్యధిక జనాభా కల గ్రామము. ఇది మంచి వ్యాపారకేంద్రము. జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఈ గ్రామంఆదిలాబాదు-నిర్మల్ మార్గంలో జాతీయ రహదారిపై ఉంది. మేడిగూడ (Mediguda): మేడిగూడ ఆదిలాబాదు జిల్లా ఇచ్ఛోడ మండలమునకు చెందిన గ్రామము. గోండు గ్రామమైన మేడిగూడ మద్య మాంసాలకు దూరంగా ఉంది. గిరిజన ఆచార వ్యవహారాలు పక్కాగా ఉండటంతో గిరిజనులు గ్రామాన్ని జిల్లా సార్‌మేడిగా ఎంపికచేశారు. ఆదిమ గిరిజనుల గురించి ఇక్కడ సమావేశాలు జరుగుతుంటాయి. సార్‌మేడి క్రమంగా మేడిగూడగా మారింది. (సార్‌మేడి అనగా గిరిజన గ్రామాల పెద్ద అని అర్థం). మద్యంతో అనేక సమస్యలు తలెత్తడంతో దశాబ్దం క్రితం గ్రామంలో మద్యాన్ని నిషేధించారు. సిరిచెల్మ (Sirichelma): సిరిచెల్మ ఆదిలాబాదు జిల్లా ఇచ్ఛోడ మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రం ఇచ్ఛోడకు 15 కిమీ దూరంలో ఉంది. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1282. ఈ గ్రామము చిన్నదైననూ చెరువుప్రక్కన కల శిల్పకళాఖండాల మూలంగా ప్రసిద్ధి చెందినది. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ మతాలను ప్రతిబింబించే శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన మల్లికార్జున ఆలయం ప్రాచీనమైనది. ప్రతిఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర సమయంలో మెస్రం వంశీయులు కొత్త మట్టి కుండలను ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఈ కుండలను గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. విశాలమైన చెరువు మధ్యలో శివాలయం ఉంది. దీన్ని గంగనడుమ జంగమయ్యగా పిలుస్తారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ichoda ICchoda Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి