జైనాథ్ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 44' 04'' ఉత్తర అక్షాంశం మరియు 78° 38' 36'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. భౌగోళికంగా ఇది ఆదిలాబాదు ఉత్తర ప్రాంతంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. మండలం గుండా 44వ నెంబరు జాతీయరహదారి వెళ్ళుచున్నది. ఉత్తర సరిహద్దు గుండా పెన్‌గంగా నది ప్రవహిస్తోంది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు తాలుకాలోనివే. మండల కేంద్రం జైనాథ్‌లో పురాతనమైన ఆలయం ఉంది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో స్థానం పొందిన జోగురామన్న ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 42 గ్రామపంచాయతీలు, 45 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో సాత్నాలా ప్రాజెక్టు ఉంది మరియు చనఖా-కొరటా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. జాతీయరహదారిపై పిప్పర్‌వాడ వద్ద టోల్‌ప్లాజా ఉంది. మండలంలోని పిప్పల్‌వావ్ పరిసరాలలో మాంగనీసు నిక్షేపాలు విస్తరించియున్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉత్తరభాగంగా ఉంది. ఇది రాష్ట్రంలోనే అతి ఉత్తరాన ఉన్న రెండో మండలం. మండలానికి తూర్పున బేల మండలం, దక్షిణమున ఆదిలాబాదు గ్రామీణ మండలం, పశ్చిమాన భీంపూర్, నైతురిన తాంసి మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44805. ఇందులో పురుషులు 22339, మహిళలు 22466. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47945. ఇందులో పురుషులు 23817, మహిళలు 24128. రవాణా సౌకర్యాలు: దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి ఇచ్ఛోడ మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఇచ్ఛోడ మండలమే బోథ్ నియోజకవర్గంలో కీలకంగా ఉంది. వ్యవసాయం, పంటలు: మండలం మొత్తం విస్తీర్ణం 29064 హెక్టార్లు. అందులో అడవులు 708 హెక్టార్లు. వ్యవసాయ భూమి 20786 (ఖ), 753 (రబీ). పెన్‌గంగా ప్రాజెక్టు ద్వారా మండలంలో 40వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే ప్రతిపాదన ఉంది. ఖనిజాలు: మండలంలో మాంగనీసు నిక్షేపాలున్నాయి. మండలంలోని కంట మేడిగూడ, భోరజ్‌లలో భూగర్భ, గనుల శాఖ నుంచి మాంగనీసు లీజుదార్లకు అనుమతి ఉంది.
జైనాథ్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అడ (Ada): అడ ఆదిలాబాదు జిల్లా జైనాథ్ మండలమునకు చెందిన గ్రామము. జనాథ్ మండల జడ్పీటీసిగా పనిచేసిన పాయల శంకర్ ఈ గ్రామానికి చెందినవారు. ఈయన ఆదిలాబాదు జిల్లా భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు.
దీపాయిగూడ (Deepaiguda):
దీపాయిగూడ ఆదిలాబాదు జిల్లా జైనాథ్ మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో స్థానం పొందిన జోగురామన్న ఈ మండలమునకు చెందినవారు.
జైనాథ్ (Jainath):
జైనాథ్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఆదిలాబాదు నుంచి 17 కిమీ దురంలో ఉంది. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం ఉంది. సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ ఆలయంగా పూజలందుకుంటున్నది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది.
కన్ప (Kanpa):
కన్ప ఆదిలాబాదు జిల్లా జైనాథ్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామ సమీపంలో సాత్నాల నదిపై సాత్నాలా ప్రాజెక్టు నిర్మించబడింది.
పిప్పర్‌వాడ (Pipparwada):
పిప్పర్‌వాడ ఆదిలాబాదు జిల్లా జైనాథ్ మండలమునకు చెందిన గ్రామం. ఇది జాతీయ రహదారికి సమీపంలో ఉంది. గ్రామస్థులకు అధ్యాత్మిక భావాలు అధికం. గ్రామస్థులు మద్యమాంసాలకు దూరంగాఉంటున్నారు. గ్రామరైతులు ఎకరానికి కొంత ప్రత్తిని విరాళంగా సేకరించి విక్రయించి దానితో శ్రీరామమందిరాన్ని నిర్మించారు. జాతీయరహదారిపై పిప్పర్‌వాడ వద్ద టోల్‌ప్లాజా ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jainath Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి