నిర్మల్ పట్టణ మండలం నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళుచున్నది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు నిర్మల్ తాలుకాలోనివే. ఆదిలాబాదు జిల్లా తొలి మహిళా చైర్ పర్సన్ సుమతీరెడ్డి నిర్మల్ కు చెందినది. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. నిమ్మనాయుడు నిర్మించిన కోట మండల కేంద్రంలో ఉంది. మండలంలో అనేక చారిత్రక కోటలు, బురుజులున్నాయి. మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు, ఒక పురపాలక సంఘం ఉన్నాయి.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. అదే సమయంలో నిర్మల్ మండలం విభజితమై నిర్మల్ గ్రామీణ మండలం ఏర్పడింది. భౌగోళికం, సరిహద్దులు: నిర్మల్ పట్టణ మండలానికి ఉత్తరాన సారంగాపూర్ మండలం, పశ్చిమాన దిలావర్‌పూర్ మండలం, తూర్పున నిర్మల్ గ్రామీణ జిల్లా, దక్షిణాన సోన్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మండలం గుండా దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. నిర్మల్ పట్టణము ప్రముఖ కూడలి. భైంసా- మంచిర్యాల మార్గము కూడా నిర్మల్ నుంచే వెళ్ళుచున్నది. హైదరాబాదు, ఆదిలాబాదు, భైంసా, మంచిర్యాల తదితర ముఖ్యపట్టణాల నుంచి మంచి బస్సు సదుపాయాలున్నాయి. మండలానికి రైలుసదుపాయము లేదు. ఆదిలాబాదు నుంచి నిర్మల్, ఆర్మూర్ ల గుండా కొత్త రైల్వే మార్గానికి ప్రతిపాదన ఉంది. చరిత్ర: ఈ ప్రాంతంలో గోండూరాజులు, నిమ్మనాయుడు, కుంటివెంట్రాద్రి తదితర పాలకులు కట్టించిన అనేక కోటలు, బురుజులు, తటాకాలు, ఆలయాలు ఉన్నాయి. నిమ్మనాయుడు నిర్మల్ కేంద్రంగా పాలించాడు. నిమ్మనాయుడి పేరిటే నిర్మల్‌కు ఆ పేరువచ్చినట్లుగా చరిత్ర ప్రకారం తెలుస్తోంది. నిజాం కాలంలో గోండుజాతికి నాయకత్వం వహించిన రాంజీగోండును మరియు ఆయన వెయ్యిమంది అనుచరులను ఉరితీసిన వెయ్యిఉరుల మర్రి నిర్మల్ పట్టణ శివారులో ఉంది. రాజకీయాలు: నిర్మల్ మండలం నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఆదిలాబాదు జిల్లా తొలి మహిళా చైర్ పర్సన్ సుమతీరెడ్డి నిర్మల్ కు చెందినది. కేంద్రమంత్రిగా పనిచేసిన సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్యేగా పనిచేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టణానికి చెందినవారు.
నిర్మల్ పట్టణ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Gajulpet, Nirmal, Siddapur, Vishwanathpet,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
నిర్మల్ పట్టణం: నిర్మల్ పట్టణం అక్టోబరు 11, 2016న జిల్లా కేంద్రంగా మారింది. అంతకుక్రితం ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది. ఇది అసెంబ్లీ నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కూడా ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పట్టణము దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయరహదారిపై ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తరాన 215 కిమీ దూరంలో ఉంది. చారిత్రకమైన బత్తీస్‌ఘర్ కోట, ఖజానా తలాబ్, ఇతర కోటలు బురుజులు, వెయ్యి ఉరులమర్రి స్మారకస్థూపం పట్టణంలో ఉన్నాయి. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీకి, పెయింటింగ్‌కు పేరుగాంచింది. పురపాలక సంఘంచే పట్టణపాలన నిర్వహించబడుతోంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nimral Urban Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి