గుడిహత్నూర్ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 31' 48'' ఉత్తర అక్షాంశం మరియు 78° 31' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మన్నూరు మరియు మత్నూరు గ్రామ సమీపంలో మధ్యతరహా చెరువులను ప్రాజెక్టులుగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడైన లక్ష్మణ్ కరడ్ ఈ మండలమునకు చెందినవారు. శాంతాపూర్ వద్ద అటవీప్రాంతంలో చారిత్రాత్మకమైన రామమందిరం ఉంది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మావల మండలం, ఈశాన్యాన ఆదిలాబాదు గ్రామీణ మండలం, తూర్పున ఇంద్రవెల్లి మండలం, దక్షిణాన సిరికొండ మండలం మరియు ఇచ్ఛోడ మండలం, పశ్చిమాన బజార్‌హత్నూర్ మండలం, వాయువ్యాన తలమడుగు మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 25704. ఇందులో పురుషులు 12851, మహిళలు 12853. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 30239. ఇందులో పురుషులు 15138, మహిళలు 15101. రవాణా సౌకర్యాలు: మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మండలానికి రైలు సదుపాయము లేదు. సరిహద్దు మండలాలైన ఆదిలాబాదు, తలమడుగు నుంచి రైలుమార్గం వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఇచ్ఛోడ మండలమే బోథ్ నియోజకవర్గంలో కీలకంగా ఉంది.
గుడిహత్నూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గుడిహత్నూరు (Gudihatnur): గుడిహత్నూరు ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండలంలో ఇదే పెద్ద గ్రామము.
లింగాపూర్ (Lingapur):
లింగాపూర్ ఆదిలాబాదు జిల్లా గుడిహత్నూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1995లో లింగాపూర్ పంచాయతీగా ఏర్పడింది. మన్నూరు (Mannur): మన్నూరు ఆదిలాబాదు జిల్లా గుడిహత్నూర్ మండలమునకు చెందిన గ్రామము. మండలంలో ఇది రెండవ పెద్ద గ్రామము. నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు లక్ష్మణ్ కరడ్ ఈ గ్రామానికి చెందినవారు. 1921 నవంబరు 23న జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, నిజాం పోరాటంలోనూ పాల్గొని జైలుకు వెళ్ళారు. మన్నూరు గ్రామ సమీపంలో మధ్యతరహా చెరువును ప్రాజెక్టులుగా నిర్మిస్తున్నారు..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gudihathnur Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి