మంచిర్యాల మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో దక్షిణ భాగంలో గోదావరి నది తీరాన ఉన్నది. మండలంలోని నస్పూర్, తాళ్ళపల్లి, తీగల్ పహాడ్ లలో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మండలము మంచిర్యాల రెవెన్యూ డివిజన్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలుగు సినిమా పాతల రచయిత్రి శ్రేష్ఠ (కలం పేరు భావన) ఈ మండలానికి చెందినది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగమైంది. అదే సమయంలో ఈ మండలాన్ని విభజించి కొత్తగా నస్పూర్, హాజిపూర్ మండలాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు మాత్రమే కలవు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున నస్పూర్ మండలం, పశ్చిమాన హాజీపూర్ మండలం, ఉత్తరాన మందమర్రి మండలం, దక్షిణాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. చరిత్ర: మంచిర్యాల మొదట లక్సెట్టిపల్లి తాలుకాలో ఉండేది. ఆ తర్వాత పంచాయతి సమితిగా ఏర్పడి జిల్లాలోనే అగ్రగామి పట్టణంగా రూపొందింది. 1947-48లలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో మండలానికి చెందిన పలువులు ఉద్యమకారులు పాల్గొన్నారు. కె.వి.రమణయ్య, అర్జున్ రావు, పి.నర్సయ్య పటేల్, కోలేటి వెంకటయ్య, చందూరి రాజయ్యలు వీరిలో ప్రముఖులు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ, మలిదశ ఉద్యమంలోనూ ఈ మండల ప్రజలు పాల్గొన్నారు. జూన్ 2, 2014లో తెలంగాణలో భాగమైన ఈ మండలం, అక్టోబరు 11, 2016న ఆదిలాబాదు జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మంచిర్యాల జిల్లాలో భాగమైంది. రవాణా సౌకర్యాలు: మంచిర్యాలకు రైల్వే మరియు జాతీయ రహదారి సౌకర్యం ఉంది. కాజీపేట- బల్హర్షా రైల్వేలైను మండలం గుండా వెళ్ళడంతో పాటు మంచిర్యాలలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. నిజామాబాదు- జగదల్‌పూర్ 16వ నెంబరు జాతీయ రహదారి మంచిర్యాల మీదుగా వెళ్ళుచున్నది. ఆసిఫాబాదు నుంచి 16వ నెంబరు జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి కూడా మంచిర్యాల వద్దనే కలుస్తుంది. రాజకీయాలు: ఈ మండలము మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనాభా: .2001 లెక్కల ప్రకారం మండల జనాభా 182846. ఇందులో పురుషులు 93581, మహిళలు 89315. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 195562. ఇందులో పురుషులు 99786, మహిళలు 95776.
మంచిర్యాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మంచిర్యాల (Manchiryal): మంచిర్యాల పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘము, రెవెన్యూ డివిజన్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు జిల్లా కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ పట్టణం జిల్లా కేంద్రంగా మారింది. పట్టణానికి రైలు సదుపాయం ఉంది. కాజీపేట - బల్హార్షా మర్గంలో మంచిర్యాల రైల్వేస్టేషన్ ఉంది. శాసనసభ్యులుగా పనిచేసిన దివాకర్ రావు, గోనె హన్మంతరావు పట్టణానికి చెందినవారు. పట్టణం గోదావరి తీరాన ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల్ శంకర్ దండేకర్ మంచిర్యాలలో ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Manchiryal, Mancheryal, Mancherial Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి