మందమర్రి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 18° 55' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 29' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. శాసనసభ్యులుగా పనిచేసిన నల్లాల ఓదేలు, బోడ జనార్థన్, సోత్కు సంజీవరావు, బి.వెంకటరావు, ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ఈ మండలమునకు చెందినవారు. మంచిర్యాల రెవెన్యూ డివిజన్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. చారిత్రక చిహ్నంగా ప్రసిద్ధి చెందిన గాంధారి ఖిల్లా ఈ మండలంలోనే ఉంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున నెన్నెల్ మండలం, నస్పూర్ మండలం, మంచిర్యాల మండలం, ఆగ్నేయాన జైపూర్ మండలం, పశ్చిమాన హాజీపూర్ మండలం, ఉత్తరాన కాసిపేట మండలం మరియు బెల్లంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. రామకృష్ణాపూర్ (రవీంద్రఖని)లో రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడ పాసింజర్ రైళ్ళు ఆపుతారు. మంచిర్యాల- ఆసిఫాబాదు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుతుంది. రాజకీయాలు: ఈ మండలము చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. చెన్నూరు నుంచి విజయం సాధించిన అత్యధికులు మందమర్రి వారే. శాసనసభ్యులుగా విజయం సాధించిన బోడ జనార్థన్, నల్లాల ఓదేలు, సోత్కు సంజీవరావు, బి.వెంకటరావు ఈ మండలానికి చెందినవారు. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 123233. ఇందులో పురుషులు 62902, మహిళలు 60331. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 99931. ఇందులో పురుషులు 50954, మహిళలు 48977.
మందమర్రి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amerwadi, Andgulapet, Chirrakunta, Mamidighat, Mandamarri, Ponnaram, Sarangapalle, Thimmapur, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆదిపేట (Adipet): ఆదిపేట మంచిర్యాల జిల్లా మందమర్రి మండలమునకు చెందిన గ్రామము. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ఈ గ్రామానికి చెందినవారు. బొక్కలగుట్ట (Bokkalagutta): బొక్కలగుట్ట మంచిర్యాల జిల్లా మందమర్రి మండలమునకు చెందిన గ్రామము. మంచిర్యాల నుంచి మందమర్రి వెళ్ళు రహదారిపై ఉంది. గ్రామానికి 3 కిమీ దూరంలో దట్టమైన అరణ్యప్రాంతంలో గోండురాజుల రాజధానిగా పనిచేసిన గాంధారిఖిల్లా ఉంది. ఇక్కడ కాకతీయుల కాలంనాటి ఖిల్లా, నాగశేషుని ఆలయం ఉన్నాయి. మందమర్రి (Mandamarri): మందమర్రి మంచిర్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. పట్టణ శివారులోని రామకృష్ణాపురంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ పట్టణము పారిశ్రామికంగా అభివృద్ధి చెందినది. చెన్నూరు నియోజకవర్గంలో భాగమైన ఈ పట్టణానికి చెందిన బోడ జనార్థన్ 4 సార్లు, నల్లాల ఓదేలు, సంజీవరావులు ఒక్కోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2006లో సీపీఐ అభ్యర్థి మహంకాళి శ్రీనివాస్ మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. బల్హార్షా నుంచి కాజీపేట వెళ్ళు సెక్షన్‌లో మందమర్రిలో రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బొగ్గు సరఫరా జరుగుతుంది. 16వ నెంబరు జాతీయ రహదారి పట్టణం గుండా వెళ్ళుచున్నది. పొన్నారం (Ponnaram): పొన్నారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలమునకు చెందిన గ్రామము. పంచాయతి పరిధిలో దొమ్మరివాగు ప్రాజెక్టు ఉంది. రామకృష్ణాపూర్ (Ramakrishnapur): రామకృష్ణాపూర్ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలమునకు చెందిన గ్రామము. ఇది సింగరేణి కార్మికక్షేత్రంగా పేరుగాంచింది. ఇక్కడ సింగరేణికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్సేగా ఉన్న బి.వెంకటరావు ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mandamarri Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి