వేమనపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. తూర్పున ప్రాణహిత నది, దానికి ఆవల మహారాష్ట్ర సరిహద్దుగా కల్గిన ఈ మండలము 19° 04' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 48' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 30 రెవెన్యూ గ్రామాలు కలవు. రాజారాం పరిసరాలలో 12, 13వ శతాబ్దం కాలం నాటి దశావతార విగ్రహాలున్నాయి. లక్షల ఏళ్ళ నాటి రాక్షసబల్లి అవశేషాలు లభించాయి. మండలంలోని కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజిలలో దేవాలయాల ధ్వజస్తంభాలకు అవసరమైన నారేప చెట్టు కలప మండలంలోలభిస్తుంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణా కోటపల్లి మండలం, పశ్చిమాన నెన్నెల్ మండలం, వాయువ్యాన కన్నేపల్లి మండలం, ఉత్తరాన కొమురంభీం జిల్లా, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జనాభా:
వేమనపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Baddampally, Badvelli (UI), Bommena, Buyyaram, Chamanpally, Dasnapur, Godampet(UI), Gorlapally, Gudepalli(UI), Jajulpet, Jakkepally, Jilleda, Kallampally, Kalmalpet(UI), Katepalli(UI), Kothapally, Kyathanpally, Maddulapally (UI), Mamda, Mukkidigudem, Mulkalpet, Nagaram, Neelwai, Oddugudem, Racharla, Rajaram, Sumptam, Suraram, Upparlapahad (UI), Vemanpally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
రాజారాం (Rajaram): రాజారాం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలమునకు చెందిన గ్రామము. ప్రాణహిత నది 2 కిమీ దూరంలో ఉంది. గ్రామశివారులో 12, 13వ శతాబ్దం కాలం నాటి దశావతార విగ్రహాలున్నాయి. వీటిని యాదవ మహారాజు కుమారుడైన అమ్మనరాజు ప్రతిష్టించినబట్లు శాసనాల ప్రకారం తెలుస్తుంది. వేమనపల్లి గ్రామంలోని శివాలయంలో ఉన్న గణపతి విగ్రహం కూడా దశావతార విగ్రహాల కాలం నాటిదేనని నమ్ముతున్నారు. చెన్నూరులో శివలింగాలను ప్రతిష్టించిన అగస్త్యమహర్షి రాజారాం పరిసరాలలోని దశావతార విగ్రహాలను సందర్శించి పూజలుచేసినట్లు ఇక్కడి నుంచి కాళేశ్వరం వెళ్ళినట్లు స్థలపురాణం చెబుతుంది. వేమనపల్లి (Vemanpally): వేమనపల్లి మంచిర్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉన్నది. 2010లో ప్రాణహిత నది పుష్కరాల సందర్భంగా వేమనపల్లిలో పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Vemanpalli or VemanPally Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి