(వికారాబాదు జిల్లా తాండూరు మండలం కోసం ఇక్కడ చూడండి)
తాండూరు మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 09' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 28' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలము బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. మంథెన రామాయణాన్ని రచించిన బాలంభట్టు కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించినా తాండూరు మండలం అచలాపురం అగ్రహారం లభించడంతో ఇక్కడే స్థిరపడ్డారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా ఉత్తరభాగంలో ఉంది. ఈ మండలానికి తూర్పున భీమిని మండలం, దక్షిణాన బెల్లంపల్లి మండలం, నైరుతిన కాసిపేట మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన కొమురంభీం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పునర్విభజనకు ముందు ఇది లక్సెట్టిపల్లి నియోజకవర్గంలో ఉండేది. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 33888. ఇందులో పురుషులు 16972, మహిళలు 16916. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 32226. ఇందులో పురుషులు 16171, మహిళలు 16055.
తాండూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Abbapur, Achalapur, Annaram, Balhanpur, Boyapalle, Chandrapalle, Choutpalle, Dwarakapur, Gampalpalle, Gopalnagar, Kasipet, Katherla, Kistampet, Kothapalle, Madaram , Narsapur, Pegadapalle, Rechini, Repallewada, Tandur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అచలాపురం (Achalapuram): అచలాపురం మంచిర్యాల జిల్లా తాండూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది బ్రాహ్మణ అగ్రహారంగా ఉండేది. మంథెన రామాయణాన్ని రచించిన బాలంభట్టు కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించినా తాండూరు మండలం అచలాపురం అగ్రహారం లభించడంతో ఇక్కడే స్థిరపడ్డారు. మాదారం (Madaram): మాదారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలమునకు చెందిన గ్రామము. 1979లో సింగరేణి బొగ్గుగనుల ఏర్పాటుతో టౌన్‌షిప్‌గా మారింది. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలవారు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆర్మీ, అయిర్ ఫోర్స్, నేవీలలో గ్రామానికి చెందిన అనేక యువకులు పనిచేస్తున్నారు. రేచిని (Rechini): రేచిని మంచిర్యాల జిల్లా తాండూరు మండలమనకు చెందిన గ్రామము. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన గుండా మల్లేష్ ఈ గ్రామానికి చెందినవారు. తాండూరు (Tandur): తాండూరు మంచిర్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురాతనమైన గ్రామము. నిజాంల కాలంలో జిల్లా ఇలాఖాగా ఉండేది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tandur Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి