చందుర్తి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో ఉత్తరం వైపున జగిత్యాల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన కోనారావుపేట మండలం, తూర్పున వేములవాడ గ్రామీణ మండలం, పశ్చిమాన రుద్రంగి మండలం, ఉత్తరాన జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మెట్‌పల్లి నుంచి వేములవాడ వెళ్ళు ప్రధాన రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగం కుమార్, మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బీరవోని లావణ్య ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43463. ఇందులో పురుషులు 21633, మహిళలు 21830.
చందుర్తి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthapalli (PK), Bandapalli, Chandurthi, Engal, Jogapur, Lingampet, Mallial, Marrigadda, Mudapalli, Sanugula, Thimmapur (PN)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బండపల్లి (Bandapalli): బండపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలమునకు చెందిన గ్రామము. 2019 ఎంపీటీసి ఎన్నికలలో బండపల్లి ఎంపీటీసి స్థానం నుంచి భాజపాకు చెందిన గడ్డం రణధీర్ రెడ్డి విజయం సాధించారు..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
CHandurthy Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి