గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. మండలం గుండా మానేరునది ప్రవహిస్తోంది. ఎగువ మానేరు డ్యాంను ఈ మండలంలో నిర్మించారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46970. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన ఎల్లారెడ్డిపేట మండలం, తుర్పున ముస్తాబాదు మండలం, దక్షిణాన సిద్ధిపేట జిల్లా, పశ్చిమాన కామారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రవాణా సౌకర్యాలు: కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా పోతుంది. రాజకీయాలు: ఈ మండలము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వంగ కరుణ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన కొమిశెట్టి విజయ ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46970. ఇందులో పురుషులు 23031, మహిళలు 23939. అక్షరాస్యుల సంఖ్య 26417.
గంభీరావుపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Dammannapet, Desaipet, Gajasingaram, Gambhiraopet, Gorantial, khurdulingampalle, Kollamaddi, Kothapalle, Laxmipuram, Lingannapet, Mallareddipet, Mucherla, Mustafanagar, Narmala, Ramanujapuram, Samudralingapuram, Srigadha, Srinivasapuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గజసింగవరం (Gajasingavaram): గజసింగవరం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలమునకు చెందిన గ్రామము. 2012 నవంబరు9న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి అధ్యక్షుడిగా పదవిపొందిన కొండూరి రవీందర్ రావు స్వగ్రామం. కోళ్లమద్ది (Kollamaddi) : కోళ్లమద్ది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యంకై 2008లో ఈ గ్రామం నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. నర్మాల (Narmala) : నర్మాల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలమునకు చెందిన గ్రామము. మానేరునదిపై ఎగువ మానేరు డ్యాంను ఈ గ్రామ సమీపంలో నిర్మించారు
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gambhiraopet Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి