ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. మండలానికి ఉత్తర సరిహద్దులో మానేరు నది ప్రవహిస్తోంది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు బద్దం ఎల్లారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలకేంద్రం ఇల్లంతకుంటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో ఆగ్నేయాన సిద్ధిపేట మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన బోయిన్‌పల్లి మండలం, పశ్చిమాన తంగెళ్ళపల్లి మండలం, తూర్పున కరీంనగర్ జిల్లా, దక్షిణాన సిద్ధిపేట జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన వెంకటరమణారెడ్డి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన సిద్ధం వేణు ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51228. ఇందులో పురుషులు 25537, మహిళలు 25691. అక్షరాస్యుల సంఖ్య 29229.
ఇల్లంతకుంట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthagiri, Anantharam, Dacharam, Galipalli, Illanthakunta, Jangareddipalli, Jawaharpet, Kandikatkoor, Muskanipet, Obulapuram (PA), Peddalingapur, Pottur, Rahimkhanpet, Ramajipet, Repaka, Sirikonda, Thallapalli, Thippapuram (PA), Vallampatla, Vanthadupula, Veljipuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కందికట్కూరు (Kandikatkur): కందికట్కూరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలమునకు చెందిన గ్రామము. 2019 ఎంపీటీసి ఎన్నికలలో కందికొట్కూరు ఎంపీటీసి స్థానం నుంచి భాజపాకు చెందిన దొమ్మటి కిశోర్ కుమార్ గౌడ్ విజయం సాధించారు. ఇల్లంతకుంట (Illantakunta): ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండలకేంద్రం. గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. గాలిపల్లి (Galipalli): గాలిపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలమునకు చెందిన గ్రామము. తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు బద్దం ఎల్లారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. 1947లో నిజాం పోలీసులు గ్రామంపై దాడిచేసి కలకలం సృష్టించారు. 300 సాయుధ పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపారు, ఇళ్ళను దోచుకున్నారు. రక్తం ఏరులై పారింది. ప్రాణాలు పోతున్నా గాలిపల్లి వీరులు ఎదురు నిలిచి పోరాడారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Illantakunta Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి