జగిత్యాల జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 5 గ్రామపంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి మరియు పెద్దపల్లి-నిజామాబాదు రైలుమార్గం, నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు 16వ నెంబరు జాతీయరహదారి మండలం గుండా వెళ్ళుచున్నవి. సెప్టెంబరు 9, 1978న జగిత్యాలలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల జైత్రయాత్ర జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్‌గా నియమితులైన బీఎస్ రాములు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాలకు చెందినవారు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలాన్ని రెండుగా విభజించి 20 గ్రామాలతో కొత్తగా జగిత్యాల గ్రామీణ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన సారంగాపూర్ మండలం, దక్షిణాన మల్యాల మండలం, తూర్పున మరియు పశ్చిమాన జగిత్యాల గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. ఇది కాకుండా జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళుటకు ప్రధాన రహదారి కూడా ఉంది. రాజకీయాలు: ఈ మండలము జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జడ్పీ చైర్మెన్ గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన్ సుద్దాల దేవయ్య, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ ఈ మండలమునకు చెందినవారు. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన సంగేపు మహేష్ ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 168951. ఇందులో పురుషులు 83817, మహిళలు 85134. పట్టణ జనాభా 103962, గ్రామీణ జనాభా 64989.
జగిత్యాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Dharur, Jagitial, Mothe, Tippannapet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జగిత్యాల (Jagityal): జగిత్యాల కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణము మరియు జిల్లా కేంద్రము. అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ పట్టణం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జిల్లా కేంద్రంగా మారింది. ఆధునిక తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 9, 1978న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల జైత్రయాత్ర జగిత్యాలలో జరిగింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jagityal Jagitial Urban Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి