12, ఏప్రిల్ 2020, ఆదివారం

రాస్ బిహారి బోస్ (Rash Behari Bose)

 రాస్ బిహారి బోస్
జననంమే 25, 1886
రంగంజాతీయోద్యమం
మరణంజనవరి 21, 1945


భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ పోరాటయోధునిగా పేరుపొందిన రాస్ బిహారి బోస్ మే 25, 1886న ఇప్పటి పశ్చిమబెంగాల్‌లోని సుబల్‌గహ గ్రామంలో జన్మించాడు. రాసు అనే ముద్దుపేరుతో పిల్వబడిన బోస్ ప్రారంభంలో డెహ్రాడున్‌లో ఫారెస్ట్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తూ జుగంతార్ సభ్యులతో స్నేహం పెంచుకున్నాడు. 1912లో ఢిల్లీలో వైశ్రాయి హార్జింగ్ హత్యకు పథకం వేశాడు. ఏనుగు అంబారీపై ఊరేగుతూ వస్తున్న హార్జింగ్‌పై బసంత్ విశ్వాస్‌తో బాలిక వేషంలో బాంబులు విరిరించాడు. కాని హార్జింగ్ తప్పించుకున్నాడూ. హార్జింగ్‌పై హత్యోదంతం విఫలమైనాక అజ్ఞాతంలోకి వెళ్ళి, తర్వాత ఠాకూర్ అనే కవి వేషంతో జపాన్ పారిపోయాడు.

1922లో జపాన్ పౌరసత్వం తీసుకొని జపానీస్ భాష నేర్చుకొని రచయితగా, జర్నలిస్టుగా భారత వాస్తవాలు ప్రచారం చేశాడు. జపానీస్ వనిత తొషికోను వివాహం చేసుకొని అక్కడే రెస్టారెంట్ ప్రారంభించి భారతీయ వంటకాలను అమ్మాడు. భారతీయ వంతకాలతో ప్రసిద్ధి చెంది "బోస్ ఆఫ్ నకమరయ"గా ప్రసిద్ధి చెందాడు.

ఆగస్టు 1, 1926న జపాన్‌లో ఆసియా దేశాల ప్రతినిధుల గోష్ఠిని నిర్వహించాడు. 1926లో పాన్ ఆసియన్ అసోసియేషన్ నెలకొల్పాడు. జపాన్‌లో హిందూ మహాసభ జపాన్ శాఖను ప్రారంభించి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇండియన్ నేషన్ల్ ఆర్మీ (ఆజాద్ హింగ్ ఫౌజ్) స్థాపించి తర్వాత దాని బాధ్యతలు సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించాడు. జనవరి 21, 1945న టోక్యోలో మరణించాడు.

ఇవి కూడా చూడండి:
  • జుగంతార్ సంస్థ,
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ,

హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక